Breaking News

బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్

Published on Wed, 11/18/2026 - 15:05

తెలుగులో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఆపై నిర్మాతగా మారి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేశ్‌కి ఒంగోలు కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో భాగంగా రూ.95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.

(ఇదీ చదవండి: ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు..బాధగా ఉంది: చిరంజీవి)

గతంలో మద్దిరాలపాడుకి చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకి బండ్ల గణేశ్ రూ.95 లక్షలు బాకీ ఉన్నాడు. అయితే దీన్ని తీర్చే క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్ ఇచ్చాడు. అయితే ఇది బౌన్స్ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదే కాదు గతంలోనే ఈ తరహా కేసులు బండ్ల గణేశ్‌పై ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకుగానూ.. బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంక్‌ వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)ని ఇతడు ఆశ్రయించగా, వేలం ప్రక్రియని రద్దు చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది. 

బండ్ల గణేష్ కి జైలుశిక్ష

దీనిపై యూనియన్‌ బ్యాంక్‌.. హైకోర్టుని ఆశ్రయించగా ఆ ఉత్తర్వులని కొట్టివేస్తూ బ్యాంక్ చర్యని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. 

(ఇదీ చదవండి: ‘బాయ్స్‌’.. తీగ కాదు అమ్మాయి నడుము)

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)