Breaking News

గులాబీ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో కాబోయే అమ్మ సమంత..!

Published on Tue, 11/17/2026 - 11:04

Pregnant Samantha spotted outside Bandra : నటి సమంత తన ప్రెగ్నెంట్‌ జర్నీని ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఆ సమయంలో నిపుణులు సూచనలతో ఎలాంటి వర్కౌట్లు చేయవచ్చు..వంటి ఎన్నో అమూల్యమైన విషయాలు పంచుకుంది. ఇప్పుడు తొమ్మిదో నెలలోకి ఎంట్రీ ఇస్తుండగా నిండు గర్భిణీ ముఖంలో కనిపించే అందం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక సెలూన్‌ బయట కనిపించి సందడి చేసింది. సాధారణ దుస్తులలో కనిపించినప్పటికీ కాబోయే అమ్మలో కనిపించే కాంతి ఆమెలో ప్రస్ఫుటంగా కనిపించింది. గులాబీ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. తెల్లటి పూల ప్రింట్‌తో వదులుగా ఉండే డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉంది. ఆమె తన లుక్‌ను ముదురు రంగు గుండ్రటి సన్‌గ్లాస్‌తో పూర్తి చేసింది. 

చేతిలో ఒక ఇన్సులేటెడ్‌ టంబ్లర్‌ పట్టుకుని బయటకు వస్తున్న పోటోలు నెట్టంగ తెగ హల్‌చల్‌ చేశాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం అక్టోబర్‌ 30న సమంత రూత్‌ ప్రభు గర్భధారణ సమయంలో తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని వివరిస్తూ..మొదటి నెల నుంచి తొమ్మిది నెల వరకు వివిధ దశల్లోని వర్కౌట్‌ దృశ్యాలు పంచుకుంది. 

అంతేగాదు నెలలు నిండి ఉన్నా..కూడా డంబెల్‌ పట్టుకుని వెయిటెడ్‌ స్క్వాట్స్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. కాగా ఆమె ప్రస్తుతం‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ అనే వంటల రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసూతి విరామం అనంతరం తన రాబోయే వెబ్‌సీరిస్‌ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ షోలో కూడా పని చేయనుంది.

 

ఇదీ చదవండి: ఈ ఫ్యామిలీకి పుట్టుకే రికార్డు ..! వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)