Breaking News

ఇంట్లో బంగారం ఉందా?.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు!

Published on Mon, 11/16/2026 - 13:46

చాలామందికి ఇంట్లో ఎంత బంగారం ఉండవచ్చు? అనే అనుమానం ఉంటుంది. అయితే.. వివాహిత మహిళ వద్ద 500 గ్రాములు, పెళ్లికాని యువతి వద్ద 250 గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల వరకు బంగారం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని కొందరు భావిస్తుంటారు. అంతేకాదు, ఈ పరిమితుల్లో బంగారం ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటారు.

కానీ.. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇస్తూ.. బంగారం పరిమితిలోపే ఉన్నంత మాత్రాన దాని మూలాలను వివరించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది. ముఖ్యంగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఈ అంశం చాలా కీలకమని కోర్టు పేర్కొంది.

అసలు కేసు ఏంటంటే?
బీహార్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగినిపై విజిలెన్స్ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. అయితే తన వద్ద ఉన్న బంగారం కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన 500 గ్రాముల పరిమితిలోపే ఉందని ఆమె వాదించారు. ఈ కారణంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పాట్నా హైకోర్టును ఆశ్రయించారు.

ఆమె వాదనను అంగీకరించిన హైకోర్టు కేసును కొట్టివేసింది. కానీ.. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతూ కీలక విషయాలను వెల్లడించింది.

కేంద్ర ఆర్థిక శాఖ, సీబీడీటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. నిర్ణీత పరిమితిలో ఉన్న బంగారాన్ని ఆదాయపు పన్ను సోదాల సమయంలో సాధారణంగా స్వాధీనం చేసుకోకుండా వెసులుబాటు ఉంటుంది. అయితే.. దీని అర్థం ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరూ అడగకూడదని కాదు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దాని మూలాలను వివరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

500 గ్రాముల లోపు ఉంటే..
బంగారం 500 గ్రాముల లోపు ఉంటే సేఫ్ అనుకోవడం పొరపాటు. సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యమైన విషయం కూడా ఇదే. బంగారం ఎంత ఉందనే దానికంటే, దాన్ని ఎలా సంపాదించారనేది కూడా కొన్ని కేసుల్లో కీలకంగా మారుతుంది.

మన దేశంలో బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం. పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు కూతుళ్లకు నగలు ఇవ్వడం, పండుగలకు బంగారం కొనడం, తరతరాలుగా ఆభరణాలు వారసత్వంగా రావడం సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో కొన్ని దశాబ్దాల క్రితం కొన్న నగలకు బిల్లులు ఉండకపోవచ్చు.

అయితే బిల్లులు లేవనే కారణంతో ఆ బంగారం అక్రమంగా సంపాదించినదని అనుకోరు. కానీ అవసరమైనప్పుడు దాని మూలాలను వివరించేందుకు కొన్ని ఆధారాలు ఉంటే మంచిది.

➤బంగారం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన బిల్లులు, రశీదులు భద్రపరుచుకోవాలి.
➤ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే బ్యాంకు లావాదేవీల వివరాలు ఉంచుకోవాలి.
➤వారసత్వంగా వచ్చిన నగలకు సంబంధించిన వీలునామాలు లేదా ఇతర పత్రాలు ఉంటే భద్రపరుచుకోవాలి.
➤పెళ్లి సమయంలో బహుమతిగా వచ్చిన బంగారానికి సంబంధించిన ఫొటోలు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

#

Tags : 1

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)