Breaking News

అందమైన గ్రే రంగు చీరలో శృతి హాసన్‌ బ్యూటిఫుల్‌ లుక్‌..!

Published on Mon, 11/16/2026 - 10:46

కోలీవుడ్‌ నటి కమల్‌ హాసన్‌ తనయ శృతి అటు సింగర్‌, ఇటు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ విమర్శకుల ప్రసంశలందుకుంటోంది. శృతి స్టైలిష్‌ విషయంలోనూ రెండు విధాలను మిళితం చేస్తూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తుంటుంది. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే స్టైలిష్‌గా ఆహార్యం ఉండేలా చూసుకుంటుంది. ఈసారి కూడా అలానే సరికొత్త లుక్‌లో తళుక్కుముంది. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా బ్యూటీఫుల్‌ గ్రే చీరలో ఆకర్షణీయంగా కనిపించింది. 

చూస్తే సంప్రదాయబద్ధంగా..లుక్‌ పరంగా స్టైలిష్‌గా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలన నవంబర్‌ 15న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వర్షాభావంతో ఉన్న చెన్నైలో అందుకు తగినట్లుగా రెడీ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. వర్షపు రోజుల్లో తన హృదయాన్ని గ్రే రంగులో ఉంచుతాయి. ఈ రోజుల్లో చెన్నైలోని అద్భుతమైన వాతావరణం తనను ఎంతగానో ఆకర్షింస్తుందని పేర్కొంది. 

ఇక ఆమె చీర అంతటా సున్నితమైన సూక్ష్మ నమునాలు, క్లిష్టమైన డిజైన్‌తో కూడిన లేత స్లేట్‌ గ్రేరంగు చీరలో హుందాగా కనిపించింది. తేలికైన ఫ్రాబ్రిక్‌ ఆహ్లాదం, ప్రశాంతత, సౌకర్యవంతం తోపాటు బ్యూటిఫుల్‌గా కనిపించేలా చేసింది. ఈ లుక్‌కి ఆడంబరమైన అలంకరణల జోలికి పోకుండా..స్టైల్‌ చేసింది. నల్లని కురులను అలలుగా వదలేసి, మినిమల్‌ మేకప్‌, సున్నితంగా తీర్చిదిద్దిన కళ్లు, చక్కటి కనుబొమ్మలు, లేత గులాబీ గోధుమ రంగు పెదవులతో తన రూపాన్ని పూర్తి చేసింది. చిన్న నల్లటి గుండ్రటి బొట్టుతో తన ఆహార్యాన్ని ముగించింది. 

‍ట్రెడిషనల్‌ లుక్‌ సింపుల్‌గా ఉండాంటే..
సంప్రదాయ శైలితో ఆకట్టుకుంటూ..సింపుల్‌గా కనబడాలనుకునే వారికి శృతి లుక్‌ హెల్ప్‌ అవుతుంది. మాములుగా వేసుకునే ప్రకాశవంతమైన రంగులకు భిన్నంగా బూడిదరంగు చీర, కొద్దిపాటి ఆభరణాలు,..చిన్న గుండ్రటి బొట్టు చాలు. మేకప్‌ కూడా తక్కువగా ఉంటే..భారీ ఆభరణాలతో పనిలేకుండానే స్టైలిష్‌గా హుందాగా కనిపిస్తారని చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

 

ఇదీ చదవండి: గృహిణి నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు..! ఇద్దరు పిల్లల తల్లి సక్సెస్‌ స్టోరీ

 

 

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)