Breaking News

చిట్టి చేతల ఘనత

Published on Sat, 11/14/2026 - 01:20

ఐదవ తరగతిలోనే ఇంటర్మీడియెట్‌ సైన్స్‌ పాఠాలపై పట్టు సాధించిన వారొకరు.. భారత, భాగవత పద్యాలను అన ర్గళంగా చెప్పేదొకరు.. కథలతో క్లాస్‌మేట్స్‌ని, టీచర్లనూ ఆకట్టుకునేదొకరు.. డుమ్మా కొట్టకుండా ఏడాదంతా స్కూల్‌కి వచ్చేదొకరు.. ఇలా తమ ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్న వివిధ స్కూల్‌ చిన్నారుల ప్రత్యేకతలు చిల్డ్రన్స్‌ డే సందర్భంగా!

ఒక బొమ్మ.. మూడు విధాలు
దీక్షగా బొమ్మలు వేస్తున్న ఈ చిన్నారి పేరు గియాన్ష్‌. రంగులతో దోస్తీ చేయడం ఇతని ప్రత్యేకత. అయితే, ఒక రంగుతో మూడు కోణాలలో మూడు బొమ్మలు వచ్చేలా డిజైన్‌ చేసి, ఏది బాగుందో చెప్పమని మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాదు, తను వేసే బొమ్మల ద్వారా ఏదో ఒక సందేశం ఉండేలా చూస్తాడు. దీంతో ఏ బొమ్మ బాగుందో చెప్పలేక చూసేవారు తడబడతారు.

పెయింటింగ్‌ కళలో తనకు తనే  పోటీగా ఉన్న ఈ చిన్నారి చదువుతున్నది ఎల్‌కేజీ. గియాన్ష్‌ వేసిన బొమ్మలలో ఏది బాగుందో చెప్పమంటే మన దగ్గర సమాధానం ఉండనంత అందంగా తన పెయింటింగ్స్‌ చూపడంలో నిష్ణాతుడు. ఎవరి వద్ద నేర్చుకోకుండానే స్వతహాగా క్రేయాన్స్‌తో బొమ్మలు వేసే గియాన్ష్‌ నిమిషాలలో బొమ్మలు వేసి, చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాడు. 
– గియాన్స్, ఎల్‌.కె.జి, టిఎమ్‌పిఎస్, ఉప్పల్‌

పై తరగతుల పాఠాలు
క్లిష్టమైన విజ్ఞాన శాస్త్ర విషయాలను అర్థం చేసుకోవడానికి వయసుతో పని లేదని నిరూపిస్తున్నాడు 5వ తరగతి చదువుతున్న అనిరుథ్‌. ఇంటర్మీడియెట్‌ స్థాయి సైన్స్‌ పాఠాలు... న్యూటన్‌ గురుత్వాకర్షణ బలం, తరంగ స్వభావం, డోలనాలు, సాంద్రత, రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, అయాన్లు–ఐసోటోపులు– మూలకాల మధ్య వ్యత్యాసం, రాతియుగం నుండి కంచు యుగం వరకు ఆ తర్వాత ఇనుపయుగంలో మానవాళి సాంకేతికంగా ఎలా పరిణామం చెందిందో వివరించడం.. అనిరుథ్‌ ప్రత్యేకత. ప్రైమరీ స్థాయిలోనే ఉన్నత పాఠశాల స్థాయి భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై పట్టు సాధిస్తున్నాడు.
– అనిరుథ్, 5వ తరగతి, మదర్‌ హోమ్‌ స్కూల్, హైదరాబాద్‌

తెలుగు భాషపై పట్టు
ఇంగ్లిషు మాధ్యమంపై మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో తెలుగుభాషపై పట్టు సాధించింది  మానస. చక్కటి శ్లోకాలనే కాకుండా  పోతన భాగవత పద్యాలను రాగ యుక్తంగా ఆలపిస్తుంది. సొంతంగా కవితలు రాస్తోంది. కథలు చెబుతుంది. సామాజిక అంశాలపై అనర్గళంగా ఉపన్యసించి మంచి వక్తగా పేరు సంపాదించుకుంది. పదవతరగతి చదువుతున్న మానస ఈ ప్రత్యేకతలతో తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 
– తుపాకుల మానస,  10వ తరగతి జెడ్‌.పి.హెచ్‌.ఎస్, సంగారెడ్డి

గణిత సమస్యలకు సులువైన పరిష్కారం
గణితంలో ఎంత పెద్ద సమస్య అయినా సులువుగా సాధించే నేర్పు వేముల పవిత్రకు ఉంది. పై క్లాసులలోని గణిత సమస్యలనూ ఇట్టే పరిష్కరించగలదు. గణితశాస్త్రంలో విద్యార్థులకు సమస్యలను ఇచ్చి, వాటిని ఎలా పరిష్కరించవచ్చో సూచనలు ఇస్తుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న పవిత్ర రవివర్మ పెయింటింగ్స్‌ను చూసి, స్ఫూర్తి పొంది చిత్రకళలోనూ రాణిస్తోంది. 
– వేముల పవిత్ర, 9వ తరగతి, జెడ్‌.పి.హెచ్‌.ఎస్, నగ్ధార్‌

డుమ్మా కొట్టకుండా స్కూల్‌కి
క్లాస్‌ను లీడ్‌ చేయడంలోనే కాదు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవడంలో అంజన్‌ ముందుంటాడు. ఎవరూ చెప్పకుండానే పర్యావరణం, పౌరాణిక పెయింటింగ్స్‌ బాగా వేస్తాడు.  డుమ్మా కొట్టకుండా స్కూల్‌కి రావడంలోనూ, నీట్‌గా తయారవడంలోనూ ముందుండి ప్రైజులు గెలుచుకుంటాడు. 
– ఎన్‌.అంజన్‌కుమార్, ఎం.పి.పి.ఎస్, 4వ తరగతి

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు