Breaking News

కాలుకు గాయం అయితే లేఆఫ్‌!

Published on Thu, 11/12/2026 - 13:11

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థల పనితీరు, మానవతా విలువలకు పడుతున్న తూట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విధుల్లో ఉన్న సమయంలో లేదా వ్యక్తిగత జీవితంలో అనుకోని ప్రమాదాల బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగులకు అండగా ఉండాల్సిన యాజమాన్యాలు, కొద్ది నెలల అనారోగ్య సెలవులను కూడా భరించలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన కార్పొరేట్ రంగంలోని మానవతా లోపాలను, ఉద్యోగ భద్రతపై నెలకొన్న ఆందోళనలను మరోసారి అద్దం పడుతోంది.

సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, 28 ఏళ్ల ఓ యువతి కాలుకు తీవ్రమైన గాయంతో ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో సంస్థ నుంచి అకస్మాత్తుగా లేఆఫ్‌ మెయిల్‌ వచ్చింది. సాధారణంగా ఉద్యోగులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు చట్టపరంగా గానీ, నైతిక పరంగా గానీ యాజమాన్యాలు అండగా ఉండాలి. అయితే, సంబంధిత కంపెనీ మాత్రం ఆ బాధితురాలు వరుసగా వైద్య సెలవులు (మెడికల్ లీవ్స్) పెట్టడాన్ని సాకుగా చూపి ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు పీరియడ్, నష్టపరిహారం (సెవరెన్స్ పే) అందించకుండానే ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కంపెనీ నిర్ణయంపై వ్యతిరేకత

శారీరక వేదనతో పాటు ఉద్యోగం కోల్పోవడంతో ఆ యువతి తీవ్రమైన మానసిక, ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ‘వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సెలవు కోరడం నేరమా?’ అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. కార్పొరేట్ సంస్థల్లో మానవ వనరుల విభాగాలు ఉద్యోగుల సంక్షేమం కంటే కంపెనీ ఉత్పాదకతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.

పెరుగుతున్న కార్పొరేట్ లేఆఫ్‌ల నేపథ్యంలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలు, లేబర్ చట్టాలు బలహీనంగా ఉన్న చోట యాజమాన్యాలు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు అనారోగ్యంతో పోరాడుతూ, మరోవైపు ఉపాధిని కోల్పోయిన ఆ యువతి ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవాలను కళ్లకు కడుతోంది.

ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)