5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
శేఖర్ మాస్టర్ కారుని ఢీకొన్న వ్యాన్!
Published on Thu, 11/12/2026 - 11:14
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ఈ రోజు(గురువారం) ఉదయం ప్రమాదం జరిగింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న చిరంజీవి ‘కాక’ సినిమా షూటింగ్‌ను ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉదయం 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శేఖర్ మాస్టర్ బృందం వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంపై స్పందించిన శేఖర్ మాస్టర్
తనకు జరిగిన కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్పందించారు. అయ్యప్ప దయ వలన మాకు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని శేఖర్ మాస్టర్ అన్నారు. షూట్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంటే ఉదయం ఐదున్నర గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగిందని వెల్లడించారు. కారులో నలుగురం ఉన్నామని.. ఎవ్వరికీ ఏమీ కాలేదని తెలిపారు. కారు వెనుక భాగం నుజ్జు నుజ్జు అయినా మాకేం కాలేదన్నారు. రాత్రికి మళ్లీ షూటింగ్‌కు వెళ్తానని.. నా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Tags : 1