Breaking News

అబద్ధ బోధలకు అడ్డుకట్ట వేయాలి.. క్రీస్తు సంఘాలకు కీలక సందేశం!

Published on Thu, 11/12/2026 - 08:55

అపొస్తలుడైన యోహాను తన ప్రకటన గ్రంథ ముగింపులో ఇలా హెచ్చరించాడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమునకు మరి ఏదైనను కలిపినయెడల ఏదైనను తీసివేసినయెడల వాని మీదకు ఈ గ్రంథమందున్న తెగుళ్లు వస్తాయి. పరిశుద్ధపట్టణంలో అతనికి ప్రవేశం ఉండదు. ఈ హెచ్చరిక మాత్రం ప్రకటన గ్రంథానికే పరిమితం (ప్రకటన 22:18,19 ). ఇంకా ఉన్న ఆరవై అయిదు గ్రంథాలకు ఏదైనా కలుపవచ్చా తీసివేయవచ్చా అనంటే ఈ మొత్తానికి కలిపి హెచ్చరిక బలంగా ఉంది. ప్రత్యేకంగా అపొస్తలుల బోధను సంరక్షించే చర్యల పటిష్ట విధానంలోని హెచ్చరిక కూడా అంతే బలంగా ఉండనే ఉంది.

‘పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను’(యూదా 1:3 ). క్రీస్తు పరిశుద్ధులుగా పేరుగాంచిన వారే అపొస్తలులు. ఈ అపొస్తలులకే క్రీస్తు తన బోధను అప్పగించాడు. ఒక్కసారే పూర్తిగా అప్పగించాడు. ఇక మరల మరల అప్పగించే పరిస్థితి ఇక ఎన్నడూ ఏనాడూ తలెత్తదు. దీన్నే తాళం వేయడం అనవచ్చు. చేర్పులు మార్పులు కొట్టివేయటాలు తీసివేయటాలు జతపరచటాలు లేవు.

దేవుని సంకల్ప నిబంధనలను బట్టి,  క్రీస్తురాకను అనుసరించి బోధ మార్పులకు గురై అది ఇంకా ఉన్నతంగా చేయబడిందే తప్ప మరొకటి కాదు. ఇదే అపొస్తలుల బోధ అని హుందాగా చెప్పవచ్చు. అయితే ఈ పరిశుద్ధ బోధను పరిరక్షించే విషయంలో అలుపెరుగని పోరాటం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అపొస్తలుల స్ఫూర్తితో యూదా ఆదిమ సంఘానికి పోరాడమని పిలుపు ఇచ్చే సమయంలో అపొస్తలులు యేసు బోధల విషయమై పోరాటం సాగిస్తున్నారు.

రక్తం కారునంతగా ఇప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. ఆదిమ సంఘం వారు అపొస్తలుల బోధయందు యెడతెగక ఉంటూ దానికి కట్టుబడి జీవిస్తూ వారి బోధకు ఖ్యాతిని ఆనాడే సంపాదించిపెట్టారు. ఇప్పుడైతే క్రీస్తు సంఘాలు ఆదిమ సంఘాన్ని అనుసరించి వారి పోరాట స్ఫూర్తితో అపొస్తలుల బోధ విషయమై యుక్తితో ఉత్తమమైన మార్గాలలో అత్యున్నత విధానాలలో పోరాడవలసి ఉంటుంది.

సద్భక్తిలో స్థిరంగా స్థిరపడిన మీదట రక్షించ బడ్డాక ఇతరుల గూర్చి, అబద్ద బోధకులను గూర్చి ఆలోచన చేయమంటుంది గ్రంథం. అవసరమైతే సత్య స్థాపనలో క్రీస్తువలె ఆత్మసంబంధంగా పోరాటం చేయమంటుంది. ’దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై ఉన్నది’ (2 తిమోతి 3: 16,17 ). సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధిచెప్పుము (2 తిమోతి. 4:2). వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము’ (తీతు 2:15 ). ఈ మూడు వచనాలు అపొస్తలుల బోధను ఆకాశానికి ఎత్తమని దాన్ని శిఖరాగ్రాన ఉంచమని చాటిచెబుతున్నాయి.

భవిష్యత్‌ తరాలను ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసేలా వారికి రాజమార్గం పరచడమే అపొస్తలుల బోధను పరిరక్షించడం. పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధ జీవితాభ్యాసం చేయదలచుకుంటే క్రీస్తు పరిశుద్ధులైన వారంతా తప్పక ధైర్యం తెచ్చుకొని అపొస్తలుల బోధ విషయమై పోరాడాలి. బోధను కాపాడుకోవాలి.

అబద్ద బోధలను అడ్డగించాలి. దుర్బోధలను దూరంగా నెట్టివేయాలి. లేఖనానుసారమైన క్రీస్తుసంఘంలో అబద్ద బోధల మాటే వినపడకూడదు. యేసు అసాధారణ సత్బోధలను పదే పదే గుర్తుకు తెచ్చేవే అపొస్తలుల ఆత్మసంబంధ బోధలు. క్రీస్తు తన బోధను వీరికి అప్పగించి వీరిని హెచ్చించడం ఓ గొప్ప విశేషం. ఇప్పుడు అపొస్తలుల బోధను విని విశ్వసిస్తేనే రక్షణభాగ్యం.

అపొస్తలుల బోధకు పట్టంకట్టడం అంటే ఇదే. ఈ బోధలో యెడతెగక ఉంటూ వర్ధిల్లింది ఆనాడు ఆదిమ సంఘం. ఆదిమ సంఘం అడుగు జాడలలో నడుచుటే నేటి సంఘాలకు క్షేమదాయకం. వ్యక్తి బోధలు, సంస్థల సిద్ధాంత బోధలు, లోక బోధల ప్రభావం నుండి ‘పరిశుద్ధుల బోధ’ ను కాపాడుకోవడం నేటి క్రీస్తు సంఘాల బాధ్యత.
ప్రధానంగా ఈ భారం ఈ కాడి క్రీస్తు సంఘ యువత మీద మోపబడింది.
– జేతమ్‌

ఇదీ చదవండి: పిల్లలపై ప్రేమ చూపించడంలో.. ప్రవక్త ముహమ్మద్‌ ఆదర్శం!

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)