Breaking News

‘దుస్తులు ధరించని సమయాల్లో రికార్డు చేస్తున్నారు!’

Published on Tue, 11/10/2026 - 20:04

అంతర్జాతీయ సమాజంలో భారత్‌ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ఓ వింతైన, ప్రమాదకరమైన కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నగరంలోని అత్యంత వెనుకబడిన, మురికివాడలను ఏకంగా భారత్‌లోని న్యూఢిల్లీ ప్రాంతంగా చూపిస్తూ కొందరు చైనీయులు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుండటం కలకలం రేపుతోంది. ప్రముఖ దినపత్రిక ‘ప్రొథమ్‌ అలో’ బయటపెట్టిన ఈ ఉదంతంపై భారత జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

అసలేం జరుగుతోంది?

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఉత్తరా, టెక్‌పరా తదితర స్థానిక మురికివాడల్లో వేలాది మంది చైనా దేశస్తులు తిష్టవేశారు. సుమారు 150 మందికి పైగా చైనా వ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతాల్లోని ఇరుకు సందులు, దుర్భర వాతావరణాన్ని కెమెరాల్లో బందిస్తున్నారు. అయితే, వీరు చైనా సోషల్ మీడియా వేదికలైన ‘వీచాట్‌’, టిక్‌టాక్‌ చైనా వెర్షన్‌ అయిన ‘డౌయిన్‌’ల్లో ఈ వీడియోలను ప్రసారం చేస్తూ.. ఇదంతా న్యూఢిల్లీలోని ప్రాంతమని అక్కడి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు.

భారత్‌పై విష ప్రచారం..

చైనాలోని తమ ప్రేక్షకులకు భారత్‌పై అత్యంత హేయమైన, తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే ఉద్దేశంతో ఈ వ్లాగర్లు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చైనాలోని సిచువాన్‌ ప్రాంతానికి చెందిన ‘మియాన్‌మియాన్‌’ అనే మహిళ నవంబర్‌ 1న ఉత్తరా సెక్టార్‌-12 సమీపంలోని కాలువ గట్టు నుంచి లైవ్‌ ఇస్తూ.. ‘ఇదే న్యూఢిల్లీ. ఇక్కడి ఇళ్లన్నీ చాలా మురికిగా ఉన్నాయి. రేకుల ఇళ్లలో కనీసం ఫ్యాన్లు కూడా ఉండవు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. అపరిశుభ్రంగా ఉంది. శాంతిభద్రతలు అసలు బాగోలేవు’ అంటూ దుష్ప్రచారం చేశారు.

మరో చైనా జాతీయదారుడైన వాంగ్‌ వీ.. స్థానిక టీ కొట్ల వద్దకు వెళ్లి అక్కడ టీ తాగుతున్న వారిని చిత్రీకరిస్తూ.. ఇదిగో వీరు తాగుతోంది గోమూత్రపు టీ అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా, అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని భారత్‌లోని పరిస్థితులుగా వర్ణిస్తూ చైనా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు.

స్థానికుల తీవ్ర ఆగ్రహం.. ప్రైవసీకి భంగం

ఈ విదేశీ వ్లాగర్ల తీరుతో స్థానిక బంగ్లాదేశీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు చైనా యూట్యూబర్లు నేరుగా ప్రజల ఇళ్లలోకి, చివరకు బాత్‌రూమ్‌ల్లోకి కూడా కెమెరాలతో చొరబడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మేము ఇళ్లలో సరిగ్గా దుస్తులు ధరించని సమయాల్లోనూ వీరు సడన్‌గా లోపలికి వచ్చి రికార్డింగ్‌లు చేస్తుంటారు. ప్రశ్నిస్తే నవ్వి క్షమాపణ చెప్పి వెళ్లిపోతుంటారు’ అని రోజినా ఖాటూన్‌, పాపియా బేగం అనే స్థానిక మహిళలు ‘ప్రొథమ్‌ అలో’ ప్రతినిధులతో వాపోయారు.

అధికారుల మౌనం

ఈ వ్యవహారంపై ఉత్తరా వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ఇన్‌ఛార్జ్‌ మహమ్మద్‌ ఖాలిద్‌ మన్సూర్‌ స్పందిస్తూ.. చైనా జాతీయదారులు ఆ ప్రాంతంలో విస్తృతంగా వీడియోలు తీస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే వారు ఎందుకు ఈ తప్పుడు ప్రసారాలు చేస్తున్నారనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. భాష రాకపోవడం వల్ల వారిని విచారించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పైస్థాయి అధికారులకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: సింగపూర్‌లో 500 టన్నుల భారీ గోల్డ్ వాల్ట్

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)