Breaking News

అందుకే.. టెస్లా సైబర్‌ట్రక్‌కు గుడ్‌బై!

Published on Mon, 11/09/2026 - 08:55

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టెస్లా.. కీలక నిర్ణయం తీసుకుంది. భారీ అంచనాలతో మార్కెట్లోకి తీసుకొచ్చిన సైబర్‌ట్రక్ ఉత్పత్తిని 2027 మధ్య నాటికి నిలిపివేయనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన X ఖాతాలో వెల్లడించారు. సైబర్‌ట్రక్ తయారీకి ఉపయోగిస్తున్న టెక్సాస్ గిగాఫ్యాక్టరీని.. సైబర్‌క్యాబ్ తయారీకి కేటాయించనున్నట్లు తెలిపారు.

ఏడాదికి 2.5 లక్షలు అనుకున్నారు
టెస్లా 2019లో సైబర్‌ట్రక్‌ను పరిచయం చేయగా.. 2023లో ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రత్యేకమైన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, భిన్నమైన డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ వాహనం.. ప్రారంభంలో చాలామందిని ఆకట్టుకుంది. కానీ అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే జరిగాయి. ప్రారంభంలో ఏడాదికి 2.5 లక్షల వాహనాలు విక్రయించవచ్చని మస్క్ అంచనా వేయగా, ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు 63 వేల యూనిట్లకు పైగా మాత్రమే అమ్ముడైనట్లు సమాచారం.

ఇక సైబర్‌ట్రక్ స్థానంలో.. కంపెనీ టెస్లా సైబర్‌క్యాబ్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రిక్ ట్యాక్సీ. ఇందులో స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ ఉండవు. ప్రత్యేకమైన బటర్‌ఫ్లై డోర్లతో రూపొందించిన ఈ వాహనాన్ని భవిష్యత్తులో తన రైడ్ హైలింగ్ సేవలకు ఉపయోగించాలని టెస్లా భావిస్తోంది.

ఇదీ చదవండి: పండుగ ఆఫర్స్.. కొత్త కార్ల కొనుగోలుపై అద్భుతమైన బెనిఫిట్స్!

సైబర్‌ట్రక్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత.. టెస్లా ప్రధాన కార్లలో మోడల్ 3, మోడల్ వై మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇప్పటికే మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తిని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2028లో కొత్త తరం రోడ్‌స్టర్ డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)