ఆ సీఎంలా మీరూ నటన ఆపేయద్దు: సాయిపల్లవి

Published on Sat, 11/07/2026 - 16:53

తమిళ స్టార్ హీరో ధనుష్‌, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’.  ఈ చిత్రం నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. దీంతో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సాయిపల్లవి హీరో ధనుష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

అభిమానులు రాజకీయ జెండాలు పట్టుకుని ఎక్కువగా కనిపించడంతో సాయిపల్లవి ఆశ్చర్చం వ్యక్తం చేశారు.  ధనుష్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ తమిళనాడు సీఎం విజయ్‌ గారిలా మీరు కూడా నటనకు దూరంగా ఉంటారేమోనని భయంగా ఉంది. ధనుష్‌ గారు ఎప్పటికీ నటుడిగానే మా మధ్య ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని సాయి పల్లవి తెలిపారు. 

ప్రచారానికి చెక్
అయితే రాజకీయ రంగప్రవేశంపై ధనుష్‌ స్పందించారు. ‘నా వెనుక ఎవరో ఉండి నన్ను నడిపిస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ నన్ను నడిపించేంది ఆ దేవుడు మాత్రమే.. నా వెనుక నిలబడేది నా అభిమానులు మాత్రమే. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాల పైనే ఉంది.’ అని ధనుష్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతానికి చెక్‌ పెట్టారు.

కాగా ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

(ఇదీ చదవండి: రూ.4000 కోట్లు కాదు.. దానిపై చర్చ జరగాలి: సల్మాన్‌ ఖాన్‌)

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)