తినదగిని రాజదంపతుల కేక్‌ విగ్రహాలు..!

Published on Sat, 11/07/2026 - 13:06

యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక కేక్ షోలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌ల పూర్తి-పరిమాణ కేక్‌ విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కేక్‌ కళాకారిణి ఎమ్మాజేన్‌ రూపొందించిన ఈ తినదగిన శిల్పాలు అచ్చం వేల్స్ యువరాజు, యువరాణిని ఆవిష్కరించారు. వారి వేషధారణతో సహా ప్రతి వివరాలను మిస్‌ చేయకుండా రూపొందించారు. వీటిని రెయిన్‌బో డస్ట్ (యూకే బేకింగ్ అండ్‌ కేక్‌ అలంకరణ ఉత్పత్తుల తయారీదారు), స్క్వైర్ కిచెన్ (యూకే ఆధారిత బేకింగ్ సామాగ్రి బ్రాండ్), ది కేక్ డెకరేటింగ్ కంపెనీ (కేక్ అలంకరణ సరఫరాదారు)ల సహకారంతో రూపొందించారు. 

అంతేగాదు నిర్వాహాకులు ఈ రాజు విగ్రహాల కేక్‌ని మా రెసిడెంట్ ఆర్టిస్ట్‌ల సేకరణ వేల్స్‌, యువరాజు, యువరాణికి అందించే పూర్తి పరిమాణ నివాళిగా పేర్కొంది ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో. అలాగే ఈ రాజ దంపతులను కేక్ రూపంలో సజీవంగా ఆవిష్కరించడానికి, వారి అద్భుతమైన పోలికల నుండి వారి వస్త్రధారణలోని క్లిష్టమైన వివరాల వరకు ప్రతి అంశాన్ని ఎంతో శ్రద్ధగా రూపొందించినట్లు పేర్కొన్నారు నిర్వాహకులు. ఈ అద్భుతమైన ప్రదర్శన, ఒకరకంగా చాలామంది కలలో కూడా ఊహించలేని విధంగా రాజకుటుంబానికి ఇంత దగ్గరగా వెళ్లే అరుదైన అవకాశాన్ని సందర్శకులకు అందిస్తుందని అన్నారు. 

పైగా రాజదంపతులను సందర్శించే పర్యటనలా కాకుండా.. నేరుగా వీక్షించడమే కాకుండా పోటోలు కూడా దిగొచ్చని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలైన క్లాడియా వింకిల్‌మన్, అలిసన్ హామండ్‌లకు కూడా కేక్ అలంకరణ జరిగింది. దీనికి అదనంగా, పోటీదారులు కూడా కేక్‌తో వివిధ కళాకృతులను సృష్టించారు, వాటిలో ఫ్రాస్టింగ్‌తో కప్పబడిన అడవి, ఒక సముద్రపు దొంగల రాణి, ఓడ కూడా ఉన్నాయి. కాగా ఈ షోలో భారత్‌ తరుఫు నుంచి నీతా శ్యామ్‌, దియాపాల్‌ ఆరతి మీర్జీ, టీనా స్కాట్‌ పరాశర్‌ తదిత బేకరీ పాక నిఫుణుల కూడా పాల్గొననున్నారు.

 

ఇదీ చదవండి: భారీగా బాణసంచా కాల్చే దేశాలివే..

 

 

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)