ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...
Breaking News
కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట
Published on Thu, 11/05/2026 - 16:06
స్టార్ నటి కృతి సనన్‌కు ఢిల్లీ హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఆమె పేరు, ఫొటోలు, గొంతు, వ్యక్తిగత గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించరాదని ఆదేశించింది. అలా రూపొందిస్తున్న ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, అభ్యంతరకర చిత్రాలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.
కృతి సనన్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ అక్టోబర్ 29 న ఈ ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 4 న ఈ తీర్పు వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు వ్యక్తులు, సంస్థలు తన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని గతంలో కృతి సనన్ కోర్టును ఆశ్రయించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి జైలర్2.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన)
Tags : 1