Breaking News

అతివకు అందని అందలం

Published on Thu, 11/05/2026 - 12:46

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఉపాధి రంగంలో లింగ సమానత్వ కొలమానం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఇందుకు సంబంధించిన గణాంకాలతో తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన ‘ఉమెన్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్: స్కేలింగ్ సక్సెస్’ నివేదిక ప్రకారం, భారతదేశంలో మేనేజర్ లేదా ఉన్నత నిర్వహణ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 12 శాతంగా మాత్రమే ఉంది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ సగటు (20 శాతం), ప్రపంచ సగటు (30.5 శాతం) కంటే చాలా తక్కువ కావడం గమనార్హం.

గణాంకాలు.. వాస్తవాలు

ప్రపంచవ్యాప్తంగా మహిళల మేనేజ్‌మెంట్ స్థానాలు 2000 సంవత్సరంలో 24.5 శాతంగా ఉండగా 2025 నాటికి అవి 30.5 శాతానికి పెరిగాయి. ఇక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ శాతం 16.2 నుంచి 20 శాతానికి పురోగమించింది. అయితే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 34 ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 32వ స్థానంలో నిలవడం ఆందోళనకరమైన పరిణామం. దక్షిణాసియాలో 10 సంస్థల్లో కనీసం ఒక సంస్థకు కూడా మహిళా నేతృత్వం దక్కని దుస్థితి నెలకొంది.

వేతనాల్లో వ్యత్యాసం

భారతదేశంలో ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ పోస్టుల్లో ఉన్న మహిళలకు చెల్లించే వేతనాలు పురుషులతో సమానంగానే ఉన్నప్పటికీ సగటున చూస్తే మాత్రం మహిళా ఉద్యోగులు గంటకు సుమారు 28 శాతం తక్కువ వేతనాన్ని పొందుతున్నట్లు ఐఎల్‌వో నివేదిక తేల్చింది. కార్పొరేట్ రంగంలో కీలకమైన విభాగాలైన మానవ వనరులు (హెచ్‌ఆర్ - 62.5%), ఫైనాన్స్ అండ్‌ అడ్మినిస్ట్రేషన్ (55.4%) వంటి రంగాల్లో మహిళలు కొంతమేర రాణిస్తున్నప్పటికీ సంస్థల భవిష్యత్తును, సీఈవో పదవులను నిర్దేశించే ప్రాఫిట్ అండ్ లాస్ (19.8%), రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (26.3%) వంటి కీలక బాధ్యతల్లో వారి భాగస్వామ్యం అత్యంత స్వల్పంగా ఉంది.

విద్య.. సాంకేతిక రంగం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళల ఉత్తీర్ణత పెరుగుతున్నప్పటికీ టెక్నాలజీ రంగాలకు సంబంధించి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్‌) కోర్సులు అభ్యసించే మహిళా గ్రాడ్యుయేట్ల శాతం భారతదేశంలో 23.1 శాతంగా మాత్రమే ఉంది (పురుషులు 31.4%). ఇది భవిష్యత్తులో ఉన్నత స్థాయి లీడర్‌షిప్ పాత్రలకు వారు ఎంపిక కావడానికి ఒక ప్రధాన అడ్డంకిగా మారుతోంది.

వ్యాపార వృద్ధిపై ప్రభావం

లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే సంస్థలు గణనీయమైన వ్యాపార లాభాలను సాధిస్తున్నాయని ఈ సర్వే బట్టబయలు చేసింది. దాదాపు 99 దేశాల్లోని 11,957 సంస్థలపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, వైవిధ్యాన్ని ప్రోత్సహించే వ్యాపారాల్లో 68.5 శాతం సంస్థలు సానుకూల ఫలితాలను, మెరుగైన లాభాలను సాధించినట్లు నివేదించాయి. కేవలం కాగితం మీద వాగ్దానాలు కాకుండా ప్రసూతి సెలవులు, నాణ్యమైన శిశు సంరక్షణ కేంద్రాలు, కుటుంబ అనుకూల విధానాలను కల్పించడం ద్వారానే ఈ అంతరాన్ని పూడ్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: డబ్బును దాచుకుంటే దరిద్రం!?

#

Tags : 1

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)