రాజమండ్రిలో జలమయమైన రోడ్లు
Breaking News
పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్!
Published on Tue, 11/03/2026 - 20:08
పాస్‌పోర్ట్ అంటే విదేశీ ప్రయాణాలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన అధికారిక పత్రం. అందులో ప్రయాణ వివరాలు, వీసాలు, ఇమ్మిగ్రేషన్ స్టాంపులు ఉంటాయి. కానీ కేరళలో పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు వచ్చిన ఓ వ్యక్తి బుక్లెట్ మాత్రం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో ప్రయాణ వివరాల కంటే చేతిరాతతో కూడిన ఫోన్ నంబర్లు, సంప్రదింపు వివరాలు, వ్యక్తిగత గమనికలే ఎక్కువగా కనిపించాయి.
ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియోను @dksardana అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం వచ్చిన వ్యక్తి పత్రాన్ని పరిశీలించిన అధికారి అందులోని వివరాలను చూసి ఆశ్చర్యపోయినట్లు వీడియోలో పేర్కొన్నారు. సాధారణ ప్రయాణ పత్రంలా కాకుండా, ఓ జేబు డైరీలా కనిపిస్తున్న ఆ పాస్‌పోర్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు తమ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రాకముందు ముఖ్యమైన ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఇతర వివరాలను చిన్న డైరీల్లో లేదా పుస్తకాల చివరి పేజీల్లో రాసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు. మరికొందరు పాస్‌పోర్ట్‌ను ఇలా వ్యక్తిగత నోట్స్ కోసం ఉపయోగించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (@hvgoenka) కూడా ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పాస్‌పోర్ట్‌ను వ్యక్తిగత డైరీగా మార్చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారిక ప్రయాణ పత్రంలో ఇన్ని వ్యక్తిగత వివరాలు ఉండటం ఇప్పుడు ఆన్లైన్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
The passport officer was shocked to see that he had converted his passport into his personal diary 😳 https://t.co/BM3yIWgs5X
— Harsh Goenka (@hvgoenka) November 3, 2026
Tags : 1