Breaking News

పండగ టైమ్‌లో రూ.10, 20, 50 నోట్లు దొరకవా?

Published on Tue, 11/03/2026 - 14:37

పండగ సీజన్‌ వచ్చిందంటే ప్రజల్లో కొనుగోళ్ల జోరు పెరుగుతుంది. ముఖ్యంగా దీపావళి సమయంలో పెద్ద నోట్లతో పాటు చిల్లర లావాదేవీల కోసం రూ.10, రూ.20, రూ.50 విలువైన చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. అయితే, రాబోయే దీపావళి పండగ వేళ మార్కెట్‌లో ఈ చిన్న నోట్ల కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో నకిలీ సర్క్యులర్ వైరల్ అవుతోంది. ఈ తప్పుడు ప్రచారంపై దేశీయ సెంట్రల్ బ్యాంకైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. ఆ సర్క్యులర్ పూర్తిగా అబద్ధమని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.

నకిలీ సర్క్యులర్ సృష్టిస్తున్న గందరగోళం

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఆ ఫోర్జరీ సర్క్యులర్ ప్రకారం.. దేశంలో డిజిటల్ చెల్లింపులు (యూపీఐ, కార్డులు, నెట్ బ్యాంకింగ్) పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ చిన్న నోట్ల ముద్రణను క్రమంగా తగ్గిస్తున్నాయని, దీనివల్ల రాబోయే దీపావళికి రూ.10, రూ. 20, రూ. 50 నోట్లు తగినంతగా లభించవని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆర్‌బీఐ గవర్నర్ పేరుతో, నకిలీ సంతకంతో అక్టోబర్ 27, 2026 నాటి తప్పుడు తేదీతో ఈ పత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ పూర్తిగా డిజిటల్ లావాదేవీలపైనే ఆధారపడాలని ఆ సర్క్యులర్ తప్పుదోవ పట్టించేలా సూచించింది.

ఆర్‌బీఐ అధికారిక వివరణ

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ వాల్ట్స్‌, కరెన్సీ చెస్ట్‌ల్లో చిన్న డినామినేషన్లతో సహా అన్ని రకాల కరెన్సీ నోట్లు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ పేరును, లోగోను, ఉన్నతాధికారుల పేర్లను అసాంఘిక శక్తులు మోసపూరితంగా వాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని హెచ్చరించింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రకటనల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి: ఈరోజు అపరంజి ధర పెరిగిందా? తగ్గిందా?

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)