Breaking News

అనసూయ డైరెక్టర్‌తో కంగనా.. రానా ప్లాన్ మామూలుగా లేదుగా!

Published on Sun, 11/01/2026 - 16:52

టాలీవుడ్ నటుడు, నిర్మాత దగ్గుబాటి రానా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఓ హారర్ థ్రిల్లర్ సినిమాను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నారు. న్యూఢిల్లీలో హాలోవీన్ సందర్భంగా నిర్వహించిన ‘హారర్‌కాన్ ఇండియా 2026’ కార్యక్రమంలో రానా ఈ విషయాన్ని ప్రకటించారు.

కంగనాతో రవిబాబు హారర్ ప్రయోగం
‘స్కేరీ పిక్చర్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కంగనా రనౌత్ కథానాయికగా నటించనున్నారు. తెలుగులో విలక్షణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు ఈ సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు. రానా దగ్గుబాటి తన నిర్మాణ సంస్థలైన సురేశ్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు.

హారర్ సినిమాలకు కేరాఫ్ రవిబాబు
రవిబాబుకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను తెరకెక్కించడంలో ఆయనది భిన్నమైన శైలి. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘అనసూయ’, ‘అవును’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ‘అదుగో’ సినిమాతో మరో ప్రయోగం చేశారు. ఇప్పుడు కంగనా రనౌత్‌తో కలిసి హిందీలో ఎలాంటి హారర్ కథను చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

ఇక కంగనా రనౌత్ కూడా రానా వెల్లడించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ‘RC17’ పై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్‌ భార్య)

 

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)