Breaking News

టేస్టీ..టేస్టీ..స్నాక్స్‌ చేసేయండిలా..!

Published on Sun, 11/01/2026 - 16:17

కశ్మీరీ దమ్‌ ఆలూ! 
కావలసినవి: చిన్న బంగాళాదుంపలు: అర కిలో, పెరుగు: అర కప్పు, కారం: 2 టీస్పూన్లు, ధనియాల పొడి:  టీస్పూన్, సోంపు పొడి: టీస్పూన్, అల్లం పొడి: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, ఇంగువ, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.

తయారీ: ఉడికించి పొట్టుతీసుకున్న బంగాళదుంపలకు చిన్న రంధ్రాలు చేసి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పెరుగులో కారం, ధనియాల పొడి, సోంపు పొడి, అల్లం పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఇంగువ వేసి, మంట తగ్గించి పెరుగు మిశ్రమాన్ని కలుపుతూ వేయాలి. వేయించిన బంగాళాదుంపలు, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. అంతే! ఘుమఘుమలాడే కశ్మీరీ దమ్‌ ఆలూ సిద్ధం!

చీజ్‌ గార్లిక్‌ బన్‌
కావలసినవి: బన్‌లు: 4, తురిమిన చీజ్‌: కప్పు, వెన్న: 3 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు: టేబుల్‌ స్పూన్, కొత్తిమీర తరుగు: 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి: అర టీస్పూన్, మిరప పొడి లేదా చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో: అర టీస్పూన్‌.

తయారీ: ఒక గిన్నెలో కరిగించిన వెన్న, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. బన్‌లను మధ్యలో పూర్తిగా విడిపోకుండా అడ్డంగా కోసి, వెల్లుల్లి వెన్న మిశ్రమాన్ని రాయాలి. మధ్యలో తురిమిన చీజ్‌ను నింపి, పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో చల్లాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి, బన్‌లను 8–12 నిమిషాలు బేక్‌ చేయాలి. 

చీజ్‌ కరిగి, బన్‌ల పైభాగం బంగారు రంగులోకి వచ్చేవరకు ఉంచాలి. ఓవెన్‌ లేకపోతే మందపాటి బాణలిలో స్టాండ్‌ పెట్టి, బన్‌ లను ప్లేట్‌లో ఉంచి మూత పెట్టాలి. తక్కువ మంటపై 8–12 నిమిషాలు వేడి చేయాలి. అంతే చీజ్‌ గార్లిక్‌ బన్‌ రెడీ! టొమాటో సాస్‌తో వేడివేడిగా వడ్డిస్తే టేస్టీగా ఉంటుంది.

పనీర్‌ మూంగ్‌ దాల్‌ చిల్లా

కావలసినవి: పెసరపప్పు: కప్పు, పనీర్‌: కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు, పచ్చిమిర్చి: 2, అల్లం తరుగు: టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, జీలకర్ర: టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా. 
తయారీ: నానబెట్టిన పెసరపప్పును అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దికొద్దిగా నీటిని పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. బాణలిలో కొద్దిగా నూనెవేసి జీలకర్ర, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, తురిమిన పనీర్, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. 

పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేసి, పెసరపప్పు పిండిని దోశలా పలుచగా పోసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. మధ్యలో పనీర్‌ మిశ్రమాన్ని పెట్టి చిల్లాను మడవాలి. మరో నిమిషం కాల్చి వేడివేడిగా దించేయాలి. అంతే, రుచికరమైన పనీర్‌ మూంగ్‌ దాల్‌ చిల్లా సిద్ధం! వీటిని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది. 

ఇదీ చదవండి: రీడింగ్ ఛాలెంజ్‌లో సంచలనం..60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!
 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)