Breaking News

60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

Published on Sun, 11/01/2026 - 15:00

దుబాయ్‌లో జరిగిన అరబ్‌ రీడింగ్‌ ఛాలెంజ్‌లో 11 ఏళ్ల చిన్నారి మయార్‌ ఒత్మాన్ అల్ షోర్‌బగీ  సుమారు రూ. 1.25 కోట్లు గెలుచుకుంది. అక్టోబర్‌ 29న దుబాయ్‌లో జరిగిన 10వ అరబ్‌ రీడింగ్‌ ఛాలెంజ్‌లో అత్యున్నత పురస్కారం అందుకున్నప్పుడు ఆ చిన్నారి మయార్‌ తీవ్ర భావోద్వేగానికిలోనైంది. ఆమె పేరు ప్రకటించగానే ఆ చిన్నారి కన్నీళ్లతో మోకరిల్లి నేలను ముద్దాడింది. 

ఆమె దుబాయ​ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ చేతుల మీదుగా ఆ ట్రోఫీని అందుకుంది. అంతేగాదు షేక్‌ మహమ్మద్‌ తన బ్యాడ్జ్‌ని తీసి ఆమె దుస్తులకు గుచ్చడమే గాక ఆమెను దగ్గరకు తీసుకుని తలపై ముద్దుపెట్టుకున్నారు. కాగా, ఈ పోటీల్లో మొత్తం 60 దేశాలకు చెందిన 40,286,428 మంది విద్యార్థులతో పోటీపడి మాయర్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ పోటీలో ఆమె మొత్తం 60 పుస్తకాలు చదివింది. 

తన దేశంలో 17.6 మిలియన్లకు పైగా పాల్గొన్నవారి నుంచి ఎంపికై, ఈజిప్ట్‌ ‍ప్రతినిధిగా నిలిచింది. ఈ మేరకు మయార్‌ మాట్లాడుతూ..రీడింగ్‌ పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించిన తన పాఠశాలకు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది. కవిత్వంతో అరబిక్‌ పుస్తకాలపై ఆసక్తి పెరిగిందని పేర్కొంది. 

అంతేగాదు తన దేశ సాంస్కృతిక ప్రాముఖ్యతను కాపాడుకునేందుకు ఈజిప్ట్‌ సమాచార శాఖ మంత్రి కావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. సంఘర్షణ శక్తిని అధిగమించడానికి, మెరుగైన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి విద్య, జ్ఞానం అత్యవసరమైన సాధనాలుగా పేర్కొంటూ అందరూ కూడా పఠనాసక్తిని పెంచుకోవాలని కోరింది మయార్‌. ఇక ఆ చిన్నారి తాను గెలుచుకున్న మొత్తాన్ని తన పాఠశాల గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఉపయోగించాలనుకోవడం విశేషం.

ఇదీ చదవండి: వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట..! అదే ఇష్టమట..

 

 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)