Breaking News

వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట..!

Published on Sun, 11/01/2026 - 14:27

హైడ్రేటెడ్ ఉండాలంటూ వైద్యులు పదే పదే నొక్కి చెబుతుంటారు. పైగా రోజుకు ఇన్నేసి లీటర్ల నీళ్లు తాగాలని సూచనలు కూడా చేస్తుంటారు. అలాంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకడు, అత్యతం విజయవంతమైన పెట్టుబడిదారుడు అయినా వారెన్‌ బఫెట్‌ అస్సలు నీళ్లే తాగరట. ఆయన గత 48 ఏళ్లుగా వాటర్‌ తాగనే లేదట. అదెలా..నీళ్లు తాగకుండా ఉండటమా..అని ఆశ్చర్యపోకండి. ఆయన హైడ్రేషన్‌గా ఉంచుకోవడానికి దానికి బదులుగా ఏం తాగేవారో తెలిస్తే నోరెళ్లబెడతారు. 

బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్, 'ఈక్విటీ మేట్స్ ఇన్వెస్టింగ్' (Equity Mates Investing) అనే పాడ్‌కాస్ట్‌లో ఈ వారెన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకసారి ఇరువురు కలిసి భోజనం చేస్తుండగా..వాటర్‌ తాగుతారా అని అడగగా, వారెన్‌ సున్నితంగా తిరస్కరించడమే గాక తాను గత ఐదు దశాబ్దాలుగా నీళ్లే ముట్టలేదన్నారని గుర్తుచేసుకున్నారు అక్మాన్‌. తనకు కావల్సినంత హైడ్రేషన్‌ తనకెంతో ఇష్టమైన చెర్రీకోక్‌తోనే అందుతుందని అన్నారట. ఆ తర్వాత మరోసారి వారెన్‌ తన ఇంటికి విందుకు రాగానే ముందుగానే ఆయనకెంతో ఇష్టమైన చెర్రీకోక్‌ని ఏర్పాటు చేశాని అక్మాన్‌ చెప్పారు. 

బ్రిటిష్ రచయిత గ్లెన్ ఆర్నాల్డ్ తన పుస్తకం "ది డీల్స్ ఆఫ్ వారెన్ బఫెట్ వాల్యూమ్ 2: ది మేకింగ్ ఆఫ్ ఏ బిలియనీర్" (The Deals of Warren Buffett Volume 2: The Making of a Billionaire)లో, ఈ పెట్టుబడిదారు రోజుకు ఐదు క్యాన్ల కోకాకోలా తాగుతారని పేర్కొన్నారు. అంతకుమందు పెప్సీ తాగేవారట. కానీ పొరుగవారి సూచన మేరకు కోకాకోలాకు మారారట. తన శరీరంలో నాల్గొవంతు కోకాకోలానే ఉంటుందని అన్నారట. 

తాను రోజుకి 2,700 కేలరీల ఆహారం తీసుకుంటే..అందులో నాల్గోవంతు కోకాకోలా నుంచే వస్తుందట. తాను కనీసం 12 ఔన్సుల డోసులు తాగుతానని అన్నారట. వారెన్‌ కుమారుడు హోవార్డు ఆయన్ను పెప్సీ వారెన్" అని పిలిచేవాడని ఆ పుస్తకంలో తెలిపారు. అంతేగాదు 1986  బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశంలో తాను చాలాఏళ్లపాటు పెప్సీ తాగిన నేను అనూహ్యంగా కోకాకోలా వైపుకి మళ్లాను..తన దృష్టిలో ఇది కంపెనీ అధికారిక సమావేశ పానీయం అని అభివర్ణించారు.

ఇదీ చదవండి: వీగన్ల కోసం..గ్రీన్‌ ఫుడ్‌ గ్యాడ్జెట్స్‌..

 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)