Breaking News

బంగారం ఇంత భారీగా పడిపోవడానికి చైనానే కారణమా?

Published on Sat, 10/31/2026 - 20:19

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికాలో ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు చైనాలో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారన్న అంచనాలు కూడా మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ఈసారి మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అక్టోబర్ 30న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ తొలుత ఔన్సుకు 3,980.40 డాలర్లకు పడిపోయింది. జూలై 17 తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇది. డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 3,991.10 డాలర్లకు దిగివచ్చాయి. అయితే అదే రోజు తర్వాతి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. రాయిటర్స్ తాజా నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ 3,880.97 డాలర్ల స్థాయికి పడిపోయి ఏడాది కనిష్ఠాన్ని తాకింది. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే బంగారం ధర దాదాపు 30 శాతం తగ్గడం గమనార్హం.

చైనాలో అమ్మకాల ఒత్తిడి?

బంగారం ధరల పతనానికి చైనా పెట్టుబడిదారుల వైఖరిలో మార్పు కూడా కారణమై ఉండొచ్చని స్విస్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ జూలియస్ బేర్ అభిప్రాయపడింది. విదేశీ పెట్టుబడులపై చైనా ఆంక్షలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో కొందరు పెట్టుబడిదారులు నగదు సమీకరించేందుకు తమ వద్దనున్న బంగారాన్ని విక్రయిస్తున్నట్లు సంస్థ విశ్లేషించింది. అయితే ఈ అమ్మకాలే ధరల పతనానికి ప్రధాన కారణమని నిర్ధారించే ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

చమురు ధరల పెరుగుదలతో వడ్డీ రేట్ల భయం

అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వృద్ధి చెందడం, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో ఫెడ్ వడ్డీ రేట్లను 3.75–4 శాతం వద్ద యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మళ్లీ పెంచాల్సి రావచ్చన్న సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ముప్పు ఏర్పడటంతో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 117 డాలర్లకు పైగా చేరింది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. అధిక వడ్డీ రేట్లు బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడుల ఆకర్షణను తగ్గిస్తాయి.

టెక్ షేర్ల పతనమూ ఎఫెక్టే..

అక్టోబర్ 30న అమెరికా టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు కూడా బంగారంపై ప్రభావం చూపాయి. కృత్రిమ మేధ రంగంలో కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడుల నుంచి ఆశించిన రాబడులు వస్తాయా? అన్న సందేహాలతో టెక్ షేర్లు పడిపోయాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు కొందరు ఇన్వెస్టర్లు బంగారం వంటి ఆస్తులను కూడా విక్రయించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే రోజు వెండి ధర కూడా 6.5 శాతం పడిపోయి ఔన్సుకు 49 డాలర్లకు చేరింది.

మళ్లీ 5,000 డాలర్లకు చేరుతుందా?

స్వల్పకాలంలో బంగారంపై ఒత్తిడి కొనసాగవచ్చని అంచనాలున్నప్పటికీ, దీర్ఘకాలికంగా ఆశాజనక పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాల రుణభారం పెరగడం, వడ్డీ చెల్లింపుల భారం, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు పసిడికి మద్దతునివ్వవచ్చని జూలియస్ బేర్ అభిప్రాయపడింది. యూబీఎస్ విశ్లేషకుడు జియోవన్నీ స్టౌనోవో కూడా వచ్చే ఏడాది బంగారం ఔన్సుకు 5,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫెడ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం దీనికి దోహదపడవచ్చని ఆయన అంచనా. అయితే ప్రస్తుత ధరల పతనం నేపథ్యంలో మళ్లీ ర్యాలీ ఎప్పుడు మొదలవుతుందన్నది స్పష్టంగా చెప్పలేం.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడవచ్చు..

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)