Breaking News

వీడు అలరిస్తాడు... అదే వీడి సత్తా

Published on Sat, 10/31/2026 - 05:28

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బత్తా’ ఒకటి. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఏదైనా సున్నితమైన అంశాన్ని సూటిగా చెప్పకుండా సుతిమెత్తగా, సుతారంగా... ముఖ్యంగా సినిమాటిక్‌గా చెబితే ఇక ఆ సినిమా సూపర్‌ హిట్టే. ఆ కోవలో తీసిన సినిమానే ‘బత్తా’. ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పణలో విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ఓ అద్భుతమనే చెప్పాలి. కథాంశం పక్కన పెడితే... విజయ్‌ సేతుపతి ఇమేజ్‌కి ఈ సినిమా చేయడమంటే చాలా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ అంత చిన్నది కాబట్టి. 

కానీ విజయ్‌ సేతుపతి చేయడం వల్ల ఈ సినిమా కథాంశం  ప్రేక్షకాదరణకు నోచుకుంది. దర్శకుడు బాలాజీ తరణీతరన్‌ ఈ కథ రాసి, తెరకెక్కించిన విధానం న భూతో న  భవిష్యతి అని చెప్పవచ్చు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతితో పాటు ఈ సినిమాలో నటించిన ఓ బాల నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా మొత్తంలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బుడతడి పేరు సాయి పృథ్వీరాజ్‌. తను ఈ సినిమాలో నటించలేదు... జీవించాడు. 

‘బత్తా’ సినిమా మొత్తం కేవలం రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. ఒకటి విజయ్‌ సేతుపతి పాత్ర అయితే మరోటి ఈ సాయి పృథ్వీరాజ్‌ది. సినిమా అయిపోయాక ఇదా కథ అని అనుకోకుండా ఉండలేరు. అంతలా మెప్పించిన ఆ కథేంటో ఓసారి చూద్దాం. 1986 కాలం ఇతివృత్తంగా రాసుకున్న కథ ఇది. అప్పట్లో మద్రాసు నగరానికి దగ్గరలో ఉండే ఓ పల్లెటూరిలో కరడుగట్టిన ఓ కసాయి రౌడీ భక్తవత్సలం బత్తా (విజయ్‌ సేతుపతి) పేరుతో చలామణీ అవుతుంటాడు. 

ఊర్లో ఉన్న చిన్నా పెద్దా అందరికీ బత్తా అంటే వణుకే. మరీ ముఖ్యంగా ఆ ఊరి ప్రైమరీ స్కూల్‌లో చదివే శబరి అనే చిన్నోడికి మాత్రం బత్తా పేరు వింటేనే చెమటలు పడుతుంటాయి. అలాంటి రౌడీని ఈ పిల్లాడు అనుకోకుండా కిడ్నాప్‌ చేస్తాడు. అదే సినిమాలోని అసలైన పాయింట్‌. మరి... పిల్లాడి చేతిలో కిడ్నాప్‌ అయిన ఈ రౌడీ బత్తా బయటపడ తాడా? లేదా? అసలు అంత పెద్ద రౌడీ చిన్నపిల్లాడి చేతికి ఎలా చిక్కాడు? ఇటువంటి వాటన్నిటికీ సమాధానమే ‘బత్తా’. 

సినిమా మొత్తం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే అనూహ్యమైన మలుపు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుంది. విజయ్‌ సేతుపతి సహజ నటన, సాయి పృథ్వీరాజ్‌ అసమాన ప్రతిభ ఈ సినిమాకి మణి మాణిక్యాలు.  ఈ ‘బత్తా’ సినిమా మాతృక తమిళం అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. మస్ట్‌ వాచ్‌ విత్‌ ఫ్యామిలీ ఫర్‌ ది వీకెండ్‌.                         

– హరికృష్ణ ఇంటూరు

 

Videos

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)