Breaking News

రూ.33 వేల కోట్ల ఆఫర్‌.. తిరస్కరించిన ‘రే-బాన్’ వారసుడు

Published on Fri, 10/30/2026 - 16:20

ప్రపంచ ప్రఖ్యాత కళ్లజోడు బ్రాండ్‌ ‘రే-బాన్‌’కు సంబంధించిన వ్యాపార సామ్రాజ్యంలో వాటాల కొనుగోలు వ్యవహారం మరోసారి కుటుంబ వివాదానికి దారితీసింది. లగ్జరీ కళ్లజోళ్ల తయారీ సంస్థ ఎస్సిలోర్‌లక్సోటికా (EssilorLuxottica)లో కీలక వాటా కలిగిన డెల్ఫిన్‌ (Delfin) సంస్థలో తనకు ఉన్న 12.5 శాతం వాటాను విక్రయించేందుకు రోకో బాసిలికో నిరాకరించారు. ఇందుకోసం ఆయన సవతి సోదరుడు లియోనార్డో మారియా డెల్‌ వెచియో ప్రతిపాదించిన 3.5 బిలియన్‌ యూరోల (రూ.33 వేల కోట్లు) ఆఫర్‌ను ఆయన తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

లక్సెంబర్గ్‌ కేంద్రంగా పనిచేసే డెల్ఫిన్‌ కుటుంబ పెట్టుబడి సంస్థ. దివంగత లియోనార్డో డెల్‌ వెచియో స్థాపించిన లక్సోటికా వ్యాపార సామ్రాజ్యానికి ఇది కీలకమైన హోల్డింగ్‌ సంస్థగా ఉంది. ప్రస్తుతం డెల్ఫిన్‌ వద్ద ఉన్న బహిరంగంగా ట్రేడయ్యే పెట్టుబడుల విలువ 40 బిలియన్‌ యూరోలకు పైగా ఉంటుందని అంచనా. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోళ్ల తయారీ సంస్థల్లో ఒకటైన ఎస్సిలోర్‌లక్సోటికాలో సుమారు 32.4 శాతం వాటా ఉంది.

వాటా కొనుగోలుకు లియోనార్డో మారియా ప్రయత్నాలు

డెల్ఫిన్‌లో తన వాటాను పెంచుకోవాలనే లక్ష్యంతో లియోనార్డో మారియా కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తన తోబుట్టువులైన లూకా, పావోలా డెల్‌ వెచియోల నుంచి కలిపి 25 శాతం వాటాను 10 బిలియన్‌ యూరోలకు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ లావాదేవీకి అవసరమైన బ్యాంకు హామీలకు డెల్ఫిన్‌ బోర్డు మద్దతు ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అనంతరం ఆగస్టులో ఆయన ఎస్సిలోర్‌లక్సోటికాలో తనకున్న పదవులన్నింటికీ రాజీనామా చేశారు.

తాజాగా రోకో బాసిలికో వాటా కొనుగోలుకు 3.5 బిలియన్‌ యూరోలు ఆఫర్‌ చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు రోకో సానుకూలంగా స్పందించలేదు. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నట్లు ఇటలీ మీడియా కథనాలు వెల్లడించాయి. మొదటిది.. రోకోకు తన వాటాను విక్రయించే ఉద్దేశం లేదు. రెండోది.. డెల్ఫిన్‌ ఆస్తుల విలువతో పోలిస్తే ఆఫర్‌ చేసిన మొత్తం తక్కువగా ఉందని భావిస్తున్నారు. మూడోది.. లియోనార్డో మారియా ఆర్థిక సామర్థ్యంపై కూడా సందేహాలున్నట్లు సమాచారం. ఆయనకు ఇప్పటికే ఒక బిలియన్‌ యూరోలకు పైగా అప్పులు ఉన్నాయని, అదనపు రుణాలు పొందడం కూడా సులభం కాదని కథనాలు పేర్కొన్నాయి.

ఎనిమిది మంది వారసుల మధ్య వాటాల వివాదం

2022లో లియోనార్డో డెల్‌ వెచియో మరణించిన తర్వాత ఆయన వ్యాపార సామ్రాజ్యంలోని డెల్ఫిన్‌ వాటాలు ఎనిమిది మంది వారసులకు సమానంగా పంచారు. ఒక్కొక్కరికి 12.5 శాతం చొప్పున వాటా లభించింది. వీరిలో ఆయన ఆరుగురు సంతానంతో పాటు భార్య నికోలెట్టా జాంపిల్లో, ఆమె మొదటి వివాహం ద్వారా జన్మించిన రోకో బాసిలికో ఉన్నారు. అయితే సంస్థలో కీలక నిర్ణయాల బాధ్యతలు మాత్రం ప్రధానంగా ఛైర్మన్‌, సీఈఓ ఫ్రాన్సిస్కో మిల్లెరి, ఇతర నిర్వాహకుల చేతుల్లో ఉన్నాయి.

ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. మరోవైపు, రోకో తన డెల్ఫిన్‌ వాటాలో కొంత భాగాన్ని అక్టోబర్‌లో తన సోదరుడు క్లెమెంటే డెల్‌ వెచియోకు విక్రయించారు. సుమారు 8 లక్షల యూరోల విలువైన ఈ లావాదేవీతో క్లెమెంటే వాటా 12.5 శాతాన్ని స్వల్పంగా దాటింది. దీంతో ఆయన డెల్ఫిన్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా మారినట్లు ఇటలీ మీడియా వెల్లడించింది.

ఇదీ చదవండి: దేశంలోని బిజినెస్‌ స్కూళ్లన్నీ మూసేయడం మంచిది!

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)