Breaking News

మార్కెట్లో జోరుగా బియ్యం ధరలు

Published on Fri, 10/30/2026 - 11:56

ప్రపంచ ఆహార ధాన్యాల మార్కెట్లో బియ్యం ధరలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతుండటం, సరఫరాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రపంచ మార్కెట్లో బియ్యం ధరలు హెచ్చవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అగ్రగామి బియ్యం ఎగుమతి దేశమైన భారత్‌లో ధరలు నిలకడగా కొనసాగుతుండగా, మరో ప్రధాన ఎగుమతిదారు వియత్నాంలో ధరలు గత రెండేళ్ల గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతుండటం గమనార్హం.

ధరల పెరుగుదలకు కారణాలు

ఆసియా మార్కెట్లలో వరి సాగుపై వాతావరణ పరిస్థితుల ప్రభావం, రవాణా, లాజిస్టిక్స్ వ్యయాలు పెరగడం వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలు, పశ్చిమాసియా నుంచి బియ్యానికి దిగుమతి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు దేశీయంగా ఖరీఫ్ సీజన్ వరి సాగు విస్తీర్ణం, వర్షపాత సరళిలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా దిగుబడి అంచనాలపై ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో భారతీయ మార్కెట్లోనూ ధరలు పెరుగుతున్నాయి.

భారత మార్కెట్, ఎగుమతుల తీరు

ప్రపంచ మార్కెట్లో భారతదేశం తన పోటీతత్వాన్ని కాపాడుకుంటూనే నాణ్యమైన బాస్మతీయేతర, బాస్మతి బియ్యం ఎగుమతులను కొనసాగిస్తోంది. కొత్త పంట మార్కెట్లోకి వస్తున్నప్పటికీ దేశీయంగా మిల్లులు, ఎగుమతిదారుల మధ్య డిమాండ్ కారణంగా ధరలు మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా నాణ్యమైన బియ్యంకు అంతర్జాతీయంగా డిమాండ్‌ నెలకొనడంతో భారతీయ ఎగుమతిదారులు సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు.

వియత్నాంలో సరికొత్త గరిష్టాలు

మరోవైపు, వియత్నాం ఎగుమతి మార్కెట్లోనూ ఇదే రకమైన ట్రెండ్ కనిపిస్తోంది. వియత్నాంకు చెందిన 5% బ్రోకెన్ (కఫా) బియ్యం ధరలు గరిష్ట స్థాయిని తాకుతూ గత రెండేళ్లలో ఎన్నడూ లేని ధర పలుకుతుంది. అక్కడి స్థానిక కరెన్సీ ఒత్తిళ్లు, ఎగుమతుల వేగం మందగించడం, అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో వియత్నాం రేట్లు పైకి కదిలాయి.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Videos

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జ‌పాన్ జారీ చేసిన రెడ్ అల‌ర్ట్!

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)