పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జపాన్ జారీ చేసిన రెడ్ అలర్ట్!
Breaking News
అడవిలో దాక్కున్నా కనిపెట్టేస్తుంది.. ఈ డ్రోన్ ప్రత్యేకత తెలుసా?
Published on Fri, 10/30/2026 - 10:24
అడవిలో ఎవరైనా తప్పిపోయారా? చుట్టూ దట్టమైన చెట్లు.. కనిపించని దారులు.. అయినా సరే.. వారి ఆచూకీ కోసం డ్రోన్ రంగంలోకి దిగుతుంది! జీపీఎస్ సిగ్నల్స్ లేకపోయినా.. మ్యాప్ అవసరం లేకపోయినా మనుషులను అనుసరించే సరికొత్త డ్రోన్ వచ్చేసింది!
దట్టమైన అడవిలో చెట్ల మధ్య దారి వెతుక్కుంటూ, కనిపించకుండా పోయిన వ్యక్తిని అనుసరించే డ్రోన్‌ను అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ప్రొఫెసర్ అనికేత్ బెరా తయారు చేశాడు. ఇటీవలే ప్రయోగాత్మకంగా పరిశీలించిన వీడియోను లింక్డిన్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు.
జీపీఎస్ సిగ్నల్స్, ముందుగా సిద్ధం చేసిన మ్యాప్ లేకుండానే పరిసరాలను గుర్తిస్తూ, చెట్లను తప్పించుకుంటూ ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఈ డ్రోన్ ఆటో కంప్యూటింగ్ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పిపోయినవారి కోసం గాలించడం, మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం వంటి పనుల్లో భవిష్యత్తులో ఇది ఉపయోగపడవచ్చు.
ఇదీ చదవండి: మన దేశ కళలకు విదేశాల్లో మార్కెట్.. ఈ టీనేజర్ ఐడియా అదుర్స్!
Tags : 1