చీర కొంటే లక్ష లాస్‌

Published on Fri, 10/30/2026 - 01:07

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ఆకాంక్ష అనే మహిళ ఆన్ లైన్ లో కొన్న చీరను తిరిగి ఇచ్చే ప్రయత్నంలో సైబర్‌ మోసానికి గురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 పెట్టి చీర కొనుగోలు చేసిన ఆమెకు అది నచ్చకపోవడంతో రిటర్న్‌ చేసింది. ఏడు రోజులు గడిచినా రీఫండ్‌ రాకపోవడంతో ఆర్డర్‌కు సంబంధించిన నంబర్‌కు ఫోన్‌ చేసింది. 

రీఫండ్‌ ఇప్పిస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె ఫోన్‌ స్క్రీన్ ను షేర్‌ చేయించి, గిఫ్ట్‌ కార్డ్‌ కూపన్ ను ఓపెన్‌ చేయించారు. దీంతో ఆమె సెంట్రల్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి ఐదు విడతల్లో మొత్తం రూ.99,518 మాయమయ్యాయి. 

మొదటగా రూ.10,000 రెండుసార్లు, ఆ తర్వాత రూ.19,999, రూ.55,000, చివరగా రూ.4,495 చొప్పున నేరగాళ్లు కాజేశారు. తన పెళ్లి కోసం, ఇంటి అవసరాల కోసం ఆకాంక్ష ఆ డబ్బును దాచుకుంది. అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో ఆమె తండ్రికి విషయమంతా చెప్పింది. ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు కాని అప్పటికే బ్యాంకు టైం అయిపోవడంతో మూసేశారు. చేసేదేం లేక బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసి, నగదు తిరిగి ఇప్పించాలని కోరింది. ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)