Breaking News

రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు విద్యుత్‌ నిలిపివేత!

Published on Wed, 10/28/2026 - 18:45

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకునే సదుపాయానికి తాత్కాలికంగా ముగింపు పలికింది. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లలోనూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ సాకెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఎలాంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేసింది.

కారణం ఏమిటి?

ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో జరిగిన ఒక ప్రమాదం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ప్రయాణ సమయంలో రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచిన ఒక ప్రయాణికుడి పవర్‌ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి దట్టమైన పొగలు అలుముకున్న సంఘటన రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేసింది. రాత్రి వేళల్లో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్లు లేదా బ్యాటరీ పేలుళ్ల వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని వెంటనే గుర్తించడం కష్టంగా మారుతోంది. దీనివల్ల ప్రాణనష్టంతో పాటు పెను ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, రాత్రి సమయాల్లో ఛార్జింగ్ పెట్టే పరికరాల పట్ల ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫోన్లు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వేతో పాటు పలు జోన్లు అభిప్రాయపడ్డాయి.

గత ఆదేశాల పునరుద్ధరణ

వాస్తవానికి ఈ నిబంధన కొత్తదేమీ కాదని, 2014 జూన్‌లోనే రైల్వే బోర్డు ఇలాంటి మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వీటి అమలు అడపాదడపా మాత్రమే జరగడం, ప్రయాణికుల్లో అవగాహన లోపించడం వల్ల ఈ నిబంధన పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రైల్వే బోర్డు దీన్ని మరింత కఠినతరం చేసింది. ఏసీ కోచ్‌లలో ఇప్పటికే ఈ నిబంధన అమలులో ఉన్నప్పటికీ నాన్-ఏసీ కోచ్‌ల్లో సిబ్బంది కొరత, ఇతర ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయనే వాదనలను బోర్డు తోసిపుచ్చింది. అన్ని కోచ్‌లలోనూ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)