Breaking News

డోర్‌-టు-డోర్‌ పార్సల్‌ సేవలకు రైల్వే శాఖ సన్నాహాలు

Published on Wed, 10/28/2026 - 17:48

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల రవాణాలోనే కాకుండా సరుకు రవాణా విభాగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుుడుతోంది. ఇప్పటివరకు రైలు ద్వారా వస్తువులను పంపాలంటే ప్రయాణికులు భారీ మూటలతో రైల్వే స్టేషన్లకు పరుగులు తీయడం, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి పేపర్‌వర్క్‌ పూర్తి చేయడం ప్రయాసగా ఉండేది. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెడుతూ కస్టమర్ల ఇంటి వద్దకే వచ్చి పార్సళ్లను సేకరించి గమ్యస్థానానికి చేరవేసే నూతన విధానానికి భారతీయ రైల్వే చర్యలు చేపడుతోంది. ‘రైల్ పార్సల్‌ యాప్ – ఘర్ సే ఘర్ తక్’ పేరుతో త్వరలో అమల్లోకి రానున్న ఈ సరికొత్త సేవలు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో సరికొత్త మైలురాయిగా నిలవనున్నాయి.

మొదటి విడతలో 8 నగరాల్లో..

ప్రారంభ దశలో ఈ సేవలను దేశంలోని ఎనిమిది ప్రధాన మహానగరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల ప్రజలు ఈ సరికొత్త డోర్‌-టు-డోర్‌ పార్సల్‌ సేవలను తొలి విడతలో పొందనున్నారు. ఈ నగరాల్లోని కస్టమర్లు తమ ఇళ్లలో ఉంటూనే రైలు మార్గం ద్వారా సురక్షితంగా తమ వస్తువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపుకోవచ్చు.

ఈ సేవలు ఎలా పనిచేస్తాయి?

  • కస్టమర్లు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పార్సల్‌ బుకింగ్, పేమెంట్ పూర్తి చేయవచ్చు.

  • నిర్దేశిత సమయంలో లాజిస్టిక్స్ భాగస్వామి సిబ్బంది నేరుగా కస్టమర్ ఇంటికి వచ్చి పార్శిల్‌ను సేకరిస్తారు.

  • కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి ఈ లాజిస్టిక్స్ సంస్థలే వస్తువులకు సురక్షితమైన ప్యాకింగ్ సేవలను కూడా (అదనపు రుసుముతో) అందిస్తాయి.

  • సేకరించిన పార్సళ్లను రైల్వే స్టేషన్‌కు చేర్చి అక్కడి నుంచి రైలు ద్వారా గమ్యస్థానానికి రవాణా చేస్తారు.

  • గమ్యస్థానంలోని స్టేషన్‌కు పార్సల్‌ చేరిన వెంటనే అక్కడి లాజిస్టిక్స్ సిబ్బంది దాన్ని స్వీకరించి రిసీవర్ ఇంటి వద్ద డెలివరీ చేస్తారు.

బుకింగ్ నిబంధనలు

ఈ అత్యాధునిక వ్యవస్థలో ప్రయాణికులు ఎక్కడా భౌతికంగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పూర్తి డిజిటల్ పద్ధతిలో సేవలు లభిస్తాయి. రైలు బయలుదేరే తేదీకి కనీసం 15 రోజుల ముందే కస్టమర్లు తమ పార్శిళ్లను బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. ఈ బుకింగ్ వెసులుబాటు రైలు బయలుదేరడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక లాజిస్టిక్స్ భాగస్వామి సంస్థలు ఆయా పార్సళ్లను రైలు బయలుదేరే సమయానికి ఒక గంట ముందు రైల్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది.

ఒకవేళ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రయాణికులు రద్దు చేసుకోవాలనుకుంటే రైల్వే శాఖ నిబంధనల ప్రకారం క్లర్కేజ్ ఛార్జ్ (రూ.10) మినహాయించి మిగతా సరుకు రవాణా రుసుమును తిరిగి చెల్లిస్తారు. అయితే డోర్‌స్టెప్ పికప్, డెలివరీ ఛార్జీల రీఫండ్ మాత్రం సంబంధిత లాజిస్టిక్స్ సంస్థల విధివిధానాలపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)