Breaking News

120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..

Published on Wed, 10/28/2026 - 14:42

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడిపినా, అలాగే నిర్ణీత వేగ పరిమితి కంటే 20 శాతం వరకు ఎక్కువ వేగంతో వెళ్లినా ఇకపై ఎలాంటి ట్రాఫిక్ ఓవర్‌స్పీడ్ చలాన్లు జారీ చేయబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. సీఐఐ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ మేరకు అధికారిక ఆదేశాలను వెల్లడించారు.

స్పష్టమైన మార్గదర్శకాలు

కొంతకాలంగా దేశంలోని పలు ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణిస్తున్న వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఆటోమేటిక్ కెమెరాల ద్వారా ఓవర్‌స్పీడ్ చలాన్లు వస్తున్నాయనే ఫిర్యాదులు పెరిగాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంబంధిత అధికారులకు, ట్రాఫిక్ నిఘా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ/గంట వేగం వరకు ప్రయాణించే కార్లు లేదా ఇతర మోటారు వాహనాలకు ఎలాంటి జరిమానాలు విధించకూడదు. అంతేకాకుండా, ఒకవేళ ఏదైనా రహదారిపై నిర్దేశిత వేగ పరిమితి కంటే అదనంగా 20 శాతం వరకు వేగం పెరిగినప్పటికీ దాన్ని కూడా మినహాయింపు పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉదాహరణకు, ఏదైనా మార్గంలో గరిష్ట వేగ పరిమితి 100 కి.మీ ఉంటే, దానిపై 20 శాతం అదనపు మినహాయింపుతో 120 కి.మీ వేగం వరకు ఎలాంటి జరిమానా ఉండదు. అయితే, ఈ 20 శాతం అదనపు పరిమితిని కూడా దాటి మరింత వేగంగా దూసుకెళ్లే వాహనదారులపై మాత్రం నిబంధనల ప్రకారం చలాన్ల జారీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతికత

రహదారులపై కేవలం స్పీడ్ కెమెరాల ద్వారా వచ్చే చలాన్ల సమస్యే కాకుండా వాహనదారులు పాటించాల్సిన లేన్ డిసిప్లిన్ (సక్రమమైన లేన్ల మార్గం)పై కూడా మంత్రి మాట్లాడారు. రహదారులపై రద్దీని నియంత్రించడానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి నేషనల్ హైవే నెట్‌వర్క్‌లో ఏఐ ఆధారిత ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను (ఏటీఎంఎస్‌) ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తొలి దశలో సుమారు 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థలను అమర్చనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: దీపావళి కానుకగా ఎస్‌యూవీ కార్లు

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)