Breaking News

‘ఈ100’ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు రయ్‌!

Published on Tue, 10/27/2026 - 04:55

న్యూఢిల్లీ: పూర్తిగా ఇథనాల్‌పై (ఈ100) నడిచే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలను కూడా ప్రవేశపెట్టేందుకు వీలుగా సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ 1989కి సవరణలను కేంద్ర రహదారి రవాణా శాఖ సోమవారం నోటిఫై చేసింది. ఈ85, ఈ100 వాహనాల ఉద్గారాలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఇందులో నిబంధనలను సవరించారు.

దీని ప్రకారం ఈ20కి మించి (ఇథనాల్‌ 20 శాతం కలిపిన పెట్రోల్‌) ఈ100 వరకు ఇంధనాలపై నడిచే వాహనాలు ప్రత్యేకంగా ఆయా ఇంధనాలకు అనుగుణంగా తయారైనవై, సరి్టఫికేషన్‌ పొందినవై ఉండాలని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ20 లేదా సాధారణ ఇంధనాన్ని ఉపయోగించే వాహనాల్లో ఈ85 లేదా ఈ100 ఫ్యూయల్‌ని వాడటానికి ఉండదని వివరించారు. మారుతీ సుజుకీ ఇటీవలే వాగన్‌ ఆర్‌ మోడల్‌లో దేశీయంగా తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారును ప్రవేశపెట్టింది.

టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్‌ తదితర సంస్థలు కూడా ఈ తరహా వాహనాలను రూపొందిస్తున్నాయి.  అలాగే ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్‌ సైతం రెండు మోడల్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్‌ రేట్లు భారీగా పెరగడంతో దిగుమతులను తగ్గించుకునేలా భారత్‌.. ప్రత్యా మ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బయోడీజిల్‌ సంబంధ నిబంధనలను కూడా ఈ నోటిఫికేషన్‌లో అప్‌డేట్‌ చేశారు. ఇక, తేలికపాటి పెట్రోల్, డీజిల్‌ వాహనాల కనీస బరువు పరిమితులను 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచారు.  

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)