Breaking News

కేవలం రూ.2 కోట్ల సినిమా.. కేజీఎఫ్‌ రికార్డ్ బద్దలు..!

Published on Mon, 10/26/2026 - 21:16

యశ్ హీరోగా వచ్చిన ఫుల్ యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ కేజీఎఫ్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో యశ్ ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్-2 సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రెండు చిత్రాలతో కన్నడ స్టార్‌ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అంతలా యశ్‌ కెరీర్‌లో గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

అయితే ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కించిన హనుమాన్ అంశ్ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. తాజాగా మరో చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్..

కన్నడలో తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ప్రేమద ఊరాలి. ఈ మూవీని కేవలం రూ.2 నుంచి 3 కోట్ల బడ్జెట్‌లోనే తెరకెక్కించారు. ఈ శాండల్‌వుడ్ మూవీ గతనెలలో థియేటర్లలో రిలీజైంది. కేవలం నెల రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కన్నడలోనే విడుదలైన ఈ సినిమా కేజీఎఫ్ ఆల్‌టైమ్‌ వసూళ్లను అధగమించింది. నెల రోజుల్లోనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కేజీఎఫ్ రికార్డ్‌ బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. కాగా.. 2018లో రిలీజైన కేజీఎఫ్ చాప్టర్-1 కన్నడ బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ రికార్డ్‌ను చిన్న సినిమా ప్రేమద ఊరాలి దాటేసి చరిత్ర సృష్టించింది. దీంతో కంటెంట్‌ ఉంటే చాలు.. భారీ బడ్జెట్‌తో అవసరం లేదని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)