Breaking News

వాటర్ కంటే పెట్రోల్ చీప్.. పన్నులు లేని దేశం!

Published on Mon, 10/26/2026 - 21:15

ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతుంటే.. ఓ దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు.. వాటర్ బాటిల్ రేటు కంటే తక్కువకే లభిస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. అక్కడ పన్నుల భారం కూడా తక్కువే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. వైద్యం సైతం తక్కువ ఖర్చుతో అందుతుంది. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా? అదే ఆగ్నేయాసియాలోని చిన్న దేశం బ్రూనై.

ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ బ్రూనైలో పర్యటించి.. అక్కడి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ  దేశం గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

చిన్న దేశం.. కొత్త అనుభూతి
బ్రూనై చిన్న దేశమే అయినా.. చమురు, సహజ వాయువు నిల్వల కారణంగా ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ పెట్రోల్ ధరలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రభుత్వ సబ్సిడీలు, దేశంలోని చమురు సంపద. అయితే.. ఈ దేశం సంపన్నమైనప్పటికీ పర్యాటకుల రద్దీ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వీడియోలో వెల్లడించారు. అందుకే సరదాగా బ్రూనైని ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ దేశాల్లో ఒకటిగా అభివర్ణించింది. కానీ, అక్కడి ప్రశాంతమైన వాతావరణం, రద్దీ లేని రోడ్లు, పచ్చని ప్రకృతి చూస్తే మాత్రం కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పారు.

బ్రూనైలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు అందుతున్నాయి. విద్య, వైద్య రంగాల్లో తక్కువ ఖర్చుతో సేవలు లభించడం అక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కోసం చాలా తక్కువ మొత్తమే చెల్లించాల్సి ఉంటుందని వీడియోలో వివరించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను సాధారణంగా లేకపోవడం కూడా.. ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

అడవులతో కప్పబడిన దేశం
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రూనైలో రాత్రిపూట పెద్దగా సందడి కనిపించదు. ఇతర దేశాల్లో రాత్రి వేళల్లో రద్దీగా ఉండే రోడ్లు, పార్టీలు, వినోద కేంద్రాలు కనిపిస్తుంటాయి. కానీ బ్రూనైలో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలుస్తోంది. దేశంలో దాదాపు 70 శాతం ప్రాంతం అడవులతో కప్పబడి ఉందని వీడియోలో వెల్లడించారు. అందమైన మసీదులు, పచ్చని అడవులు, ప్రకృతి అందాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. మద్యం విషయంలోనూ బ్రూనైలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. స్థానిక ముస్లింలకు మద్యం నిషేధం కాగా, మద్యం దిగుమతి, వినియోగంపై ఇతరులకూ ఆంక్షలు వర్తిస్తాయి.

ఇదీ చదవండి: ఏఐతో ఉద్యోగాలకు చెక్‌?.. ఇక వ్యవసాయమే దిక్కా?

ఇక భారతీయులు బ్రూనైకి వెళ్లాలనుకుంటే విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. చెన్నై నుంచి రాయల్ బ్రూనై ఎయిర్‌లైన్స్ ద్వారా నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఇతర నగరాల నుంచి సింగపూర్, మలేషియా మీదుగా కనెక్టింగ్ విమానాల్లో ప్రయాణించవచ్చు. విమాన టికెట్ ధరలు సీజన్, ప్రయాణ తేదీలను బట్టి మారుతాయి. వన్‌వే టికెట్ ధర సుమారు రూ.17,000 నుంచి రూ.21,000 వరకు ఉండవచ్చు. భారతీయులకు మూడు రోజుల వరకు వీసా లేకుండా ప్రవేశం లభిస్తుందని చెబుతున్నారు. అయితే, ప్రయాణానికి ముందు తాజా వీసా నిబంధనలను అధికారికంగా నిర్ధారించుకోవడం మంచిది.

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)