Breaking News

గడ్డ అనుకుంటే ప్రెగ్నెన్సీ..! జస్ట్‌ ఐదు గంటల్లోనే చేతిలో బిడ్డ..

Published on Mon, 10/26/2026 - 17:30

ఓ మహిళకు తొమ్మిది నెలల వరకు ప్రెగ్నెన్సీ అని తెలియలేదు. ఎందుకంటే పెరిమెనోపాజ్‌లోకి ప్రవేశిస్తున్నాను కాబట్టి నెలసరి ఆగిపోయిందనుకుంది. అయితే పొట్టలో ఏదో గడ్డలా ఉందని ఆస్ప్రతికి వెళ్తే..ఇలా అడ్మిట్‌ అయినా కొంచెం సేపటికే చేతిలో బిడ్డను పెట్టారు వైద్యులు. ఆ హఠాత్పరిణామానికి పాపం ఆ మహిళలకు తల్లినయ్యాను అన్న ఆనందమే ఆమెలో కలగలేదు. 

ఈ వింత సంఘటన యూకేలో చోటచేసుకుంది. యూకేకు చెందిన 41 ఏళ్ల మహిళ  సామీ ఇవాన్స్‌ అంతుచిక్కని గడ్డ కోసం వైద్యుడిని సంప్రదించింది. ఆమె తన పక్కటెముకల వద్ద అసాధారణమైన గడ్డను గమనించింది. తీవ్రమైన వ్యాయామం కారణంగా కండరాలపై ఒత్తిడి ఏర్పడి వచ్చిన గడ్డగా భావించింది. అలాగే ఆమెకు ఎలాంటి ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించకపోవడంతో తాను ప్రెగ్నెంట్‌ అన్న సందేహం ఆమెకు ఎన్నడూ కలగలేదు. 

బహుశా పెరిమెనోపాజ్‌లోకి ప్రవేశించడంతోనే నెలసరి ఆగిపోయిందని భావించింది. పైగా ఎందకనో ఆ ప్రైవేట్‌ప్లేస్‌లో ఏదో ఇబ్బంది అనిపించి పాప్‌స్మియర్ టెస్ట్ సైతం చేయించుకుంది. అయినా కూడా ఏం తెలియలేదు. చివరికి ఆ అసౌకర్యాన్ని భరించలేక వైద్యును సంప్రదించి గర్భ నిర్థారణ పరీక్షలు కూడా చేయగా అవి కూడా నెగిటివ్‌ అనే వచ్చాయి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఓ రెండు రోజులు ఆగి మరోసారి ప్రెగ్నెన్సీ టెస్ట్‌‌ చేయించుకోమని సూచించారు. ఇక లాభం లేదనుకుని మరో వైద్యుడిని సంప్రదించింది అక్కడ కూడా అదే రిజల్ట్‌కి దాంతో విసుగొచ్చేసింది ఇవాన్స్‌కి. 

ఇక ఆయన ఒకసారి ఇంటికి వెళ్లి నిధానంగా ఇదే టెస్ట్‌ మరోసారి చేసుకుని చూడమన్నారు. మరుసటి రోజు ఆస్పత్రికి రాగానే వైద్యులు తదుపరి పరీక్షలు చేసి చూద్దాం మీ అనుమానం కూడా తీరిపోతుందన్నారు. అందుకు సరే అంది ఇవాన్స్‌. దాంతో వైద్యులు  అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయగా.. ఇవాన్స్‌ తొమిదినెలల నిండు గర్భిణి అని తేలింది. చెప్పాలంటే ఇక్కడ వైద్యులు సైతం కంగుతిన్నారు. అంతేగాదు కాసేపట్లోనే తనకు డెలివరి అవుతుందని వైద్యులు అంచనా వేశారు. అన్నట్లుగానే క్షణాల్లో పెయిన్స్‌ రావడం డెలివరీ అవ్వడం పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి. 

అయితే ఇవాన్స్‌ చాలా విపరీతమైన నొప్పులు పడాల్సి వచ్చింది, చివరికి కుట్టు కూడా పడ్డాయి ఆమెకు. అయితే తనకు మగపిల్లాడు పుట్టాడన్న ఆనంద కలగలేదు ఎందుకంటే ఆస్పత్రిలో జాయిన్‌ అయిన ఐదు గంటలకే ఆమె ప్రెగ్నెంట్‌ అన్న షాకింగ్‌ విషయం తెలియడం, తను భర్తకు చెప్పడం..ఆ వెంటనే జన్మనివ్వడం ఇవన్నీ ఆమెను తీవ్రమైన షాక్‌కి గురిచేశాయి. ఆమె ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే అవకాశం లేకుండానే చేతిలో పండండి బిడ్డ ఉండటం ఇవాన్స్‌ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేశాయంటే..తనేనా కన్నది..?, ఇది నిజమేనా..?, అన్న అయోమయంలోనే ఉండిపోయింది పాపం. 

అయితే ఆ బిడ్డను ఆమె భర్త, కుటుంబసభ్యులు సాదారంగా ఆహ్వానించడం విశేషం. ఇలా ఒక మహిళకు తను ప్రెగ్నెంట్‌ అన్న సంకేతాలు లేకుండా బిడ్డకు జన్మనివ్వడాన్ని వైద్య పరిభాషలో క్రిప్టిక్‌ ప్రెగ్నెన్సీ అని పిలుస్తారట. ఇది నిజంగా మాములు వింత కాదు కదూ..!.

ఇదీ చదవండి: రెండో ప్రపంచ యుద్ధం నాటి వీరుడు ..! ఆ శతాధిక వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే..
 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)