Breaking News

కోటి రూపాయలు అంటే.. చిల్లర డబ్బు అయిపోయిందా?

Published on Mon, 10/26/2026 - 16:28

మన దేశంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఎంత సంపద ఉండాలి? కోటి రూపాయలు ఉంటే హాయిగా జీవించవచ్చా? లేక ముందుగానే ఉద్యోగానికి స్వస్తి చెప్పాలంటే కనీసం రూ.5 కోట్లు, రూ.10 కోట్లు ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలపై సామాజిక మాధ్యమం రెడిట్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. 35 ఏళ్ల వయస్సులో రూ.2 కోట్ల సొమ్ముతో పదవీ విరమణ చేసి, తక్కువ ఖర్చులతో కూడిన నగరంలో స్థిరపడాలని ఓ యూజర్‌ చేసిన పోస్ట్‌ ఈ చర్చకు కారణమైంది.

బెంగళూరులో ఇల్లు వద్దు..

‘భారతదేశంలో కోటి రూపాయలు కేవలం పాకెట్‌ మనీ ఎప్పుడు అయిపోయింది?’ అనే అర్థం వచ్చే శీర్షికతో ఆ యూజర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. హాయిగా జీవించాలన్నా, ముందుగానే ఉద్యోగ విరమణ చేయాలన్నా కనీసం రూ.10 కోట్ల కార్పస్‌ అవసరమని కొందరు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన చర్చల్లో వాస్తవికతకు బదులు భారీ లక్ష్యాలకే ప్రాధాన్యం పెరుగుతోందా? అని ప్రశ్నించారు.

తాను 35 ఏళ్ల వయస్సులో రూ.2 కోట్ల నిధితో ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన బెంగళూరులో రూ.2–3 కోట్లు వెచ్చించి చిన్న అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేయడానికి బదులు, తక్కువ ఖర్చులతో జీవించగలిగే టైర్‌-2 నగరంలోని సొంతూరుకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగం చేసుకుంటూ, తర్వాత సొంత వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు వివరించారు.

రూ.2 కోట్లతో నెలకు రూ.1.5 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారాన్ని నిర్మించగలననే అంచనా కూడా తనకు ఉందని పేర్కొన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు, ద్రవ్యోల్బణం, ఆరోగ్య ఖర్చులు వంటి రిస్క్‌లు ఉంటాయని తనకు తెలుసని, అయినప్పటికీ ఆర్థిక స్వేచ్ఛకు రూ.10 కోట్లే కనీస ప్రమాణంగా మారడంపై సందేహం వ్యక్తం చేశారు.

నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు యూజర్‌లు ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. ఈరోజు రూ.1 కోటి లేదా రూ.2 కోట్లతో లభించే జీవన ప్రమాణాలు, మరో 20–30 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతాయని భావించకూడదని అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్‌ తర్వాత బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే జీవించాలనుకోవడం కూడా దీర్ఘకాలంలో సవాలుగా మారవచ్చని కొందరు వ్యాఖ్యానించారు.

మరికొందరు వినియోగదారులు రూ.5 కోట్ల సంపద కూడా ముందస్తు పదవీ విరమణకు సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు అయితే 40 ఏళ్లలో ఉద్యోగం మానేయాలంటే రూ.20 కోట్లు అవసరమని చెప్పే పరిస్థితి ఏర్పడిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)