Breaking News

పక్షులను చూస్తే.. మెదడుకు ఇంత మేలా? పరిశోధనలు ఏమంటున్నాయంటే!

Published on Mon, 10/26/2026 - 12:56

వృద్ధాప్యంలో మెదడు పనితీరు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? పక్షులను గమనించే అలవాటు దీనికి తోడ్పడుతుందా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. పక్షుల కిలకిలరావాలు, వాటి కదలికలను ఆస్వాదించడం మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా.. మెదడు ఆరోగ్యానికీ మేలు చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను కాపాడుకోవడంలో ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంగ్లండ్‌లోని ఫోర్జ్‌ మిల్‌ సరస్సు వద్ద నిర్వహిస్తున్న పక్షుల వీక్షణ కార్యక్రమం డిమెన్షియా బాధితుల్లో ఆసక్తిని పెంచుతోంది. 78 ఏళ్ల హారోల్డ్‌ అనే వ్యక్తి ఈ సమస్యతో ఆందోళనకు గురవుతుండగా, ఆయన కుమార్తె లూసీ పక్షులను చూపించేందుకు అక్కడికి తీసుకెళ్లారు. మొదట వద్దనుకున్న ఆయన.. రాబిన్‌ పక్షి, నీటిలో ఆడుకుంటున్న బాతులను చూసి నవ్వారు. బ్రిటన్‌కు చెందిన ఏజ్‌ యూకే సంస్థలో పనిచేస్తున్న జెన్నీ బుడింగర్‌ అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి అనుభవాలు బాధితులు తమ ఆందోళనలను కొంతసేపు మరిచి ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేందుకు తోడ్పడతాయి.

మానసిక ఒత్తిడికి చెక్‌..
కెనడాలోని బేక్రెస్ట్‌ అకాడమీ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన ఎరిక్‌ వింగ్‌ నేతృత్వంలో పరిశోధకులు పక్షులను గుర్తించడంలో నిపుణులైనవారి మెదడులను, కొత్తవారి మెదడులను ఎంఆర్‌ఐ స్కాన్లతో పరిశీలించారు. ఈ అధ్యయనంలో నిపుణుల్లో ఏకాగ్రత, దృశ్యాలను గుర్తించడం వంటి పనులకు సంబంధించిన మెదడు తీరు మరింత చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

అలాగే, మెదడులోని కొన్ని భాగాల మధ్య సమన్వయం మెరుగ్గా ఉన్నట్లు పరిశోధన సూచించింది. అయితే, ఈ మార్పులకు పక్షులను గమనించే అలవాటే కారణమని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వింగ్‌ పేర్కొన్నారు. జర్మనీలోని కాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఐచ్ష్టాట్‌-ఇంగోల్‌స్టాడ్ట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ కాల్స్‌ బృందం.. 65 వృద్ధాశ్రమాల్లో పక్షులకు ఆహారం అందించే ఏర్పాట్లు చేసింది. వృద్ధులు వాటిని గమనించేలా చేసి వారి మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని పరిశీలించింది. 

మానసికంగా బాధపడుతున్న కొందరిలో కొన్ని వారాల్లోనే సంభాషణలను అనుసరించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, గతంలో చూసిన పక్షులను గుర్తుపట్టడం వంటి అంశాల్లో సానుకూల మార్పులు కనిపించాయని, దీంతో బవేరియా ప్రాంతంలోని 400కు పైగా వృద్ధాశ్రమాల్లో పక్షులను వీక్షించే ఏర్పాట్లకు మద్దతు లభించిందని బృందం చెబుతోంది.

మెదడుకు మేలు..
అమెరికాలోనూ డిమెన్షియా బాధితుల కోసం ‘బర్డ్‌ టేల్స్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో కనెక్టికట్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. ఇందులో పక్షులకు ఆహారం అందించడంతోపాటు, పక్షుల్లా శబ్దాలు చేసే బొమ్మలతో అనేక జాతులను పరిచయం చేస్తారు.

మానసిక బాధితుల మెదడుకు చురుకుదనం లభించడంతోపాటు, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే అవకాశం కలుగుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. పక్షులను గమనించడానికి వాటి పేర్లు, రకాలపై పూర్తి అవగాహన అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

పోలాండ్‌లో 388 మంది పక్షి వీక్షకులపై నిర్వహించిన అధ్యయనంలో.. ఈ అలవాటుపై ఎక్కువ ఆసక్తి చూపేవారు.. ఎక్కువగా మానసిక ప్రశాంతతను అనుభవిస్తున్నట్లు గుర్తించారు. ప్రకృతితో అనుబంధం, కొత్త విషయాలపై ఆసక్తి, ఇతరులతో సంభాషించడం వంటివి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

అయితే, పక్షులను చూడటం ఒక్కటే డిమెన్షియాను నివారిస్తుందని లేదా నయం చేస్తుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అయినప్పటికీ, వైద్య సంరక్షణకు అదనంగా ఇలాంటి కార్యకలాపాలు వృద్ధుల మానసిక ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు మేలు చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బయటకు వెళ్లలేని వారు ఇంటి కిటికీ దగ్గర నుంచే పక్షులను గమనించవచ్చు. ఇది చిన్న అలవాటే అయినా.. ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకుంటూ, మనసును ఉల్లాసంగా ఉంచేందుకు ఎంతో సులభమైన పద్ధతిగా పరిశోధనలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: నిద్ర చెప్పే వ్యాధుల సంకేతాలు.. ఏఐతో గుర్తింపు!

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)