Breaking News

సముద్రం పక్కనే ఎర్రటి కొండలు.. ఈ బీచ్‌ అందాలు చూశారా?

Published on Mon, 10/26/2026 - 09:06

కేరళలోని వర్కల అనేది ప్రకృతి ప్రేమికులకు, సముద్ర తీరంలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి బాగా నచ్చే ప్రదేశం. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఎత్త్తైన ఎర్రటి కొండచరియలు, బంగారు రంగులో మెరిసే ఇసుక తీరాలు, కొబ్బరి చెట్లు, అందమైన సంధ్యా సమయాలు.. ఇవే వర్కల ప్రత్యేకతలు. హైదరాబాద్‌ నుంచి కుటుంబంతో లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్‌.

హైదరాబాద్‌ నుంచి వర్కలకు ఎలా వెళ్లాలి?
రైలులో..
హైదరాబాద్‌ నుంచి తిరువనంతపురం వైపు వెళ్లే రైళ్లలో ప్రయాణించి వర్కల శివగిరి రైల్వే స్టేషన్‌ లో దిగవచ్చు. అయితే అన్ని రైళ్లకు ఈ స్టేషన్‌ లో ఆగే సౌకర్యం ఉండకపోవచ్చు. టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు రైలు మార్గం, స్టాప్‌లను చెక్‌ చేసుకోండి.

విమానంలో..
హైదరాబాద్‌ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ట్యాక్సీ లేదా ఇతర రవాణా సౌకర్యాలతో సుమారు 40–50 కిలోమీటర్ల దూరంలోని వర్కలకు వెళ్లవచ్చు. ట్రాఫిక్‌ను బట్టి ప్రయాణ సమయం మారుతుంది.

చూడదగిన ప్రదేశాలు

  • వర్కల క్లిఫ్‌: సముద్రాన్ని ఎత్తు నుంచి చూస్తూ నడవడానికి, చక్కగా ఫోటోలు తీసుకోవడానికి ఇది మంచి ప్లేస్‌. ఇక్కడ కేఫ్‌లు, చిన్న దుకాణాల్లో పర్యాటకుల సందడి కనిపిస్తుంది.

  • పాపనాశం బీచ్‌: వర్కలలో ఇది పాపులర్‌ బీచ్‌. ఈ సముద్ర తీరానికి ఆధ్యాత్మికంగా కూడా ్రపాధాన్యత ఉంది. అందుకే ఇక్కడికి టూరిస్టులతో పాటు భక్తులు కూడా వస్తుంటారు. సముద్రంలో ఈత కొట్టేటప్పుడు స్థానికుల సూచనలు, అధికారుల సలహాలు పాటించండి.

  • జనార్దన స్వామి ఆలయం: ఇది ఒక పురాతన వైష్ణవ క్షేత్రం. వర్కల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా చెబుతారు.

  • శివగిరి మఠం: శ్రీనారాయణ గురువుకు సంబంధించిన ఈ ప్రదేశం సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి ఉన్నవారు వెళ్లాల్సిన ప్రదేశాల్లో ఒకటి.

  • కప్పిల్‌ బీచ్, కప్పిల్‌ సరస్సు: సముద్రం, సరస్సు కలిసినట్టుగా కనిపించే ప్రకతి దశ్యాలు ఈ ్రపాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వర్కలలో ఏం తినాలి?  
కేరళ వంటకాలలో అప్పం, వెజిటబుల్‌ స్ట్యూ, పుట్టు, కడల కర్రీ, మసాలా దోశ, కేరళ పరాటా, వెజిటబుల్‌ మీల్స్‌ రుచి చూడవచ్చు. సీ ఫుడ్, ఫుడ్‌ వెరైటీలు ఇష్టపడేవారికి చేపల వంటకాలు అందుబాటులో ఉంటాయి. బీచ్‌ సమీపంలోని కేఫ్‌లలో భారతీయ వంటకాలతో పాటు కాంటినెంటల్‌ ఫుడ్‌ కూడా లభిస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి? ఎక్కడ ఉండాలి?

వర్కల విజిట్‌ చేయడానికి అక్టోబర్‌ నుంచి మార్చి వరకు బెస్ట్‌ టైమ్‌.

బీచ్‌ సమీపంలో బడ్జెట్‌ హోమ్‌స్టేలు, హోటళ్లు, రిసార్టులు అందుబాటులో ఉంటాయి. వీకెండ్స్‌లో, సెలవుల్లో ప్లాన్‌ చేస్తే ముందుగానే బుకింగ్స్‌ చేసుకోవడం ఉత్తమం.

వర్కల పర్యటనలో సముద్రపు అందాలను ఆస్వాదించడంతో పాటు కేరళ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలుసుకోవచ్చు. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది.

ఇదీ చదవండి: సిక్కిం వెళ్తున్నారా? ఈ అద్భుతమైన ప్రదేశాలు మిస్‌ కావొద్దు!

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)