'హైకూ' సినిమా రివ్యూ

Published on Fri, 10/23/2026 - 21:20

'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి హీరోయిన్‌గా చేసిన తమిళ సినిమా 'హైకూ'. తెలుగులోనూ ఇది థియేటర్లలో రిలీజైంది. లేడీస్ కాలేజీలో అబ్బాయి ఒక్కడే ఉండటం అనే విభిన్నమైన కాన్సెప్ట్ మూవీపై ఆసక్తి రేపింది. ఇందుకు తగినట్టుగానే విడుదలైన టీజర్, ట్రైలర్‌ అంచనాలను పెంచడంలో సఫలమయ్యాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

కథేంటి?
కాలేజీ నుంచి సస్పెండ్ అయిన మనోహర్ (ఏగన్).. సిటీలోని వేరే కాలేజీల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో.. లేడీస్ నుంచి కో ఎడ్యుకేషన్‌గా మారిన కాలేజీలో సీటు దొరుకుతుంది. అక్కడ పవళకుడి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళతాడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ వల్ల మనో-కుడి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? వాళ్ళిద్దరూ విడిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? కుడి మరో పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటి? చెన్నైలో ఇంటర్న్‌గా పనిచేసే నివేదా(ఫెమినా జార్జ్)తో మనో ప్రేమ, సహజీవనంలో ఏం జరిగింది? మనోకి దూరం కావాలని నివి ఎందుకు నిర్ణయించుకుంది? చివరికి కుడిని కలిశాక మనో ఏం తెలుసుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
లేడీస్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో అబ్బాయి ఒక్కడే అనే పాయింట్‌తో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించారు. సాధారణంగా చిత్రాల్లో అమ్మాయిలని అబ్బాయిలు ర్యాగింగ్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అబ్బాయిని అమ్మాయిలు ర్యాగ్ చేసే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. అమ్మాయిల మధ్యలో హీరో పడే ఇబ్బందులు నవ్విస్తాయి. హీరోకి హీరోయిన్ రాఖీ కట్టడం, వారి పరిచయ సన్నివేశాలు బాగున్నాయి. ప్రేమలో పడిన తర్వాత వచ్చే కులం పట్టింపులు లాంటివి రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ టైంపాస్ చేయించారు. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంచారు. ఉద్యోగంలో చేరిన తర్వాత హీరో ప్రేమలో పడతాడని ముందే అర్థమవుతుంది. అయితే నివేదాతో ప్రేమలో పడిన తర్వాత వచ్చే కాన్‌ఫ్లిక్ట్ కొత్తగా ఉంది.

మనసులో వేరొకరి జ్ఞాపకాలను ఉంచుకుని, తనపై చూపించే ప్రేమ వద్దనుకునే అమ్మాయి నివి కథే ఈ సినిమా అసలు ఆత్మ. బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడే కాన్సెప్ట్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ‘హైకూ’ ప్రత్యేకత ఏమిటంటే... బ్రేకప్ తర్వాత గతంలో ప్రేమించిన అమ్మాయిని గుర్తుపెట్టుకుని, ఆ రిలేషన్‌లో చేసిన తప్పులు తన దగ్గర రిపీట్ చేయకూడదని అనుకోవడాన్ని నివి సహించలేకపోతుంది. వేరొకరి నీడలో ఉండే ప్రేమ తనకు వద్దని అంటుంది. ఈ అంశాన్ని తెరపై ఎమోషనల్‌గా సరిగా చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా ఏగన్‌ కాలేజీలో అమ్మాయిల మధ్య ఇబ్బంది పడే సన్నివేశాలలో ఈజీగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త పరిణతి చెందాలి. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయారు. ఫెమినా జార్జ్ గ్లామర్ పరంగానే కాకుండా చక్కటి నటనతో ఆకట్టుకుంది. మిగిలిన ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం పర్లేదనిపించగా సిద్ధూ కుమార్ సంగీతం కథకు తగ్గట్లు ఉంది. పీయూష్ గురుసామి కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఈతరం యువత, ముఖ్యంగా 'జెన్-జీ' జనరేషన్‌కు ప్రేమలో చేసే పొరపాట్ల గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే ‘హైకూ’. వినోదంతో పాటు సందేశం బాగున్నప్పటికీ, ఎమోషన్స్‌ని మరింత హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)