భారతీయులకు చైనా వీసా ప్రక్రియలో మార్పులు

Published on Fri, 10/23/2026 - 14:21

భారతీయ దరఖాస్తుదారులకు చైనా వీసా ప్రక్రియలో డ్రాగన్ ప్రభుత్వం మార్పులకు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 26, 2026 నుంచి ఇండియాలో చైనా వీసా సమర్పణ, దరఖాస్తు విధానాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు వీసా కేంద్రాల ద్వారా సాగిన ఈ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ నేరుగా దౌత్య కార్యాలయాల పరిధిలోకి మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తాజా మార్పుల ప్రకారం, దరఖాస్తుదారులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసి, పత్రాలను అప్‌లోడ్ చేసి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత దౌత్య కార్యాలయాల్లో భౌతిక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, సరికొత్త అధికారిక విధివిధానాల ప్రకారం ప్రాంతాలవారీగా బాధ్యతలను విభజించారు. ముంబైలోని చైనా కాన్సులేట్ పరిధిలోకి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు రాగా, మిగతా ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తులను ఢిల్లీలోని భారతీయ చైనా రాయబార కార్యాలయం పర్యవేక్షించనుంది. తాజా సవరణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల దరఖాస్తుదారులు తాత్కాలిక ప్రాతిపదికన ఢిల్లీ ఎంబసీని ఆశ్రయించాల్సి ఉంటుంది.

ఫీజుల్లోనూ మార్పులు

వీసా రుసుముల విషయానికి వస్తే సింగిల్ ఎంట్రీకి రూ.2,900, డబుల్ ఎంట్రీకి రూ.4,400, ఆరు నెలల మల్టిపుల్ ఎంట్రీకి రూ.5,900, ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న వీసాకు రూ.8,800గా ఫీజు నిర్ణయించారు. అయితే, ప్రస్తుత మార్పుల కారణంగా ఫీజుల చెల్లింపు విధానంలోనూ తాత్కాలిక మార్పులు చేసారు. దరఖాస్తుదారులు డిమాండ్ డ్రాఫ్ట్స్ (డీడీ) ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని, డీడీ వెనుక తమ పేరు, కలెక్షన్ స్లిప్ నంబర్, ఫోన్ నంబర్ విధిగా రాయాలని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపార, విద్యా లేదా పర్యాటక ప్రయాణాలు చేసే భారతీయులు ఈ సరికొత్త నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: డివైజ్‌లో సిమ్‌ లేకపోతే వాట్సాప్‌ సేవలు బంద్‌!

#

Tags : 1

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)