డివైజ్‌లో సిమ్‌ లేకపోతే వాట్సాప్‌ సేవలు బంద్‌!

Published on Fri, 10/23/2026 - 12:23

దేశంలో పెరుగుతున్న సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర టెలికాం శాఖ (డాట్‌) కఠినమైన ‘సిమ్-బైండింగ్’ నిబంధనలను తీసుకువచ్చింది. డిసెంబర్ 31, 2026 నాటికి ఈ కొత్త మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లు, యాప్ నిర్వాహకులను ఆదేశించింది. దీని ప్రకారం, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

సిమ్‌ తొలగిస్తే..

ఈ నూతన నిబంధనల ప్రకారం.. ఇకపై వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లోని యాక్టివ్‌ సిమ్ కార్డుతోనే వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇప్పటివరకు రిజిస్టర్డ్ సిమ్ ఫోన్‌లో లేకపోయినా వై-ఫై ఆధారంగా లేదా సెకండరీ డివైజ్‌ల్లో ఈ యాప్‌లను వాడుకునే వెసులుబాటు ఉంది. కానీ, సిమ్-బైండింగ్ నిబంధన అమల్లోకి వస్తే.. ఏ డివైస్‌లో అయితే యాప్ రిజిస్టర్ అయిందో అదే డివైస్‌లో ఆ నంబర్‌కు సంబంధించిన సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. సిమ్ తొలగిస్తే ఆయా డివైజ్‌లలో సర్వీసులు నిలిచిపోతాయి.

సైబర్‌ నేరాలకు చెక్‌

సైబర్ నేరగాళ్లు నకిలీ ఐడెంటిటీలతో నంబర్లు సృష్టించి రిజిస్టర్డ్ సిమ్ లేకుండానే విదేశాల నుంచి లేదా ఇతర డివైజ్‌ల నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న కోట్లాది రూపాయల డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే, ఈ తాజా నిబంధనలతో తరచూ సిమ్ కార్డులు మార్చేవారికి, ఒకే నంబర్‌ను వేర్వేరు పరికరాల్లో వాడేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ గడువులోగా టెక్‌ దిగ్గజాలు ఈ నిబంధనలకు అనుగుణంగా తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, వినియోగదారులు భవిష్యత్తులో ఎలాంటి అంతరాయాలను ఎదుర్కోకుండా తమ రిజిస్టర్డ్ సిమ్‌ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వాడేవారు..

ప్రస్తుతం మనం ఒకసారి ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాగిన్ అయితే ఆ తర్వాత ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా డెస్క్‌టాప్/లాప్‌టాప్‌లో వెబ్ వాట్సాప్, టెలిగ్రామ్‌లు పనిచేస్తూనే ఉంటాయి. కొత్త నిబంధన తర్వాత ఈ వెసులుబాటు ఉండే అవకాశం లేదు. డెస్క్‌టాప్ లేదా వెబ్ వెర్షన్ నడవాలంటే.. యాక్టివ్ సిమ్ ఉన్న ప్రాథమిక మొబైల్ ఆన్‌లైన్‌లో ఉండటం లేదా నెట్‌వర్క్ కనెక్టివిటీ కలిగి ఉండటం తప్పనిసరి అవుతుంది.

వెబ్ సెషన్లు నిరంతరాయంగా పనిచేయడానికి బదులుగా కొన్ని గంటలకు లేదా ఒక నిర్ణీత వ్యవధికి సిమ్ నెట్‌వర్క్‌ను వెరిఫై చేసే వ్యవస్థను డెవలప్ చేయాలని టెక్ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఫోన్‌లో సిమ్ తీసివేసినా లేదా ఇన్-యాక్టివ్ అయినా వెబ్ సెషన్లు వెంటనే లాగౌట్ అయిపోతాయి.

ఇదీ చదవండి: రుబియో జామ్‌నగర్ పర్యటన.. సంకేతాలు ఏమిటి?

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)