Breaking News

సీతమ్మ చీర సిత్రాలు..! మైండ్‌బ్లోయింగ్‌ ట్రెడిషనల్‌​ లుక్స్‌

Published on Tue, 10/20/2026 - 11:47

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ మూవీ ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీడియోల్, రావణుడిగా యశ్‌ నటించారు. ఈ మూవీ ప్రేక్షకులకు చేరువయ్యేలా చిత్ర బృందం పలు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఆ నేపథ్యంలో హెదరాబాద్‌ చేరుకుని ఇక్కడ తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా మొత్తం చిత్ర బృందం పాల్గొని ప్రేక్షకులను అలరించారు. 

హైదరాబాద్‌లో తెలుగు రామాయణ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని శ్రేయా మీడియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవి దూబే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో సాయిపల్లవి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు హైదరాబాద్‌లో అభిమానులు ఆమెకు గులాబీ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. సింపుల్‌సిటీకి కేరాఫ్‌గా ఉండేఆ ఆమె ఈ వేడుకలో పర్పుల్‌ కలర్‌ టిష్యూ సిల్క్‌ చీరలో మెరిసింది. 

అచ్చం సీతమ్మలా తన ఆహార్యంతో కట్టిపడేసింది ప్రేక్షకుల్ని. నాణ్యమైన చేనేత వస్త్రం,బంగార జరీ పని, వెటాల్‌కి మెరుపు..ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయ్‌. ఆ చీరకు జతగా ధరించి బ్లౌజ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్లౌజ్‌పై ముందు వెనుక భాగాల్లో క్లిష్టమైన జరీ వర్క్‌ ఉంది. దీనికి అనుగుణంగా జత డ్రాప్‌ ఇయర్‌రింగ్స్‌, రత్నాలు పొదిగిన కడాలు, ఎడమ చేతికి చుట్టిన జపమాలతో ఎప్పటిలా సింపుల్‌ మేకప్‌తో అత్యంత నేచురల్‌గా కనిపించింది. 

కాగా, ఢిల్లీ, ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో సైతం.. ఇలానే అందమైన పట్టు చీరల్లో మెరిసి అందర్నీ ఆకట్టుకుంది సాయిపల్లవి. కాగా, నాలుగువేల కోట్ల ప్రాజెక్టు అయిన ఈ రామయణ మూవీ రెండు భాగాలుగా విడుదలకానుంది. మొదటి భాగం ఈ నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండోభాగం 2027లో విడుదల కానుంది.

ఫ్యాషన్‌ పాఠాలివే..

సందర్భానికి అనుగణంగా మనం ధరించే దుస్తులు ఉండాలని నటి సాయిపల్లవి ధరించే ఫ్యాషన్‌ వేర్‌ల నుంచి తెలుస్తోంది. రామాయణ మూవీలో తన సీత పాత్రకు అనుగుణంగా లుక్‌ ఉండేలా ప్రతి ప్రమోషన్‌లో కేర్‌ తీసుకోవడం విశేషం.

విభిన్నమైన పట్టు చీరలు, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడినవే ఎంచుకుని మన సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతూ..సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలుస్తోంది

ప్రతి చీరకు ఆభరణాలు కాదు ..చీర డిజైన్‌ని బట్టి ధరించాలని ఆమె స్లైలింగ్‌ శైలి చెబుతోంది. 

అలాగే నేచరల్‌ లుక్‌లో అందమే అసలైన అందమని ప్రతిసారి తన ఆహార్యంతో చెప్పకనే చెబుతోంది సాయిపల్లవి

 

ఇదీ చదవండి: డ్రాగన్‌ ఫ్రూట్‌తో ఏడాదికి రూ. 2 కోట్లు..! జస్ట్‌ మూడు ఎకరాల నుంచి..

 

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)