Breaking News

మళ్లీ వస్తున్న ఐకానిక్‌ కారు.. సిట్రోయెన్‌ 2 CV ప్రత్యేకతలివే!

Published on Sun, 10/18/2026 - 21:10

ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ (Citroen) తన పాత ఐకానిక్‌ కారు 2 CVను సరికొత్త రూపంలో తిరిగి లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2026 పారిస్‌ మోటార్‌ షోలో ప్రదర్శించిన 2 CV కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందించిన ఒక కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది.

సిట్రోయెన్‌ 2 CV కారును హ్యాచ్‌బ్యాక్‌, పికప్‌ అనే రెండు వెర్షన్లలో తీసుకురానున్నట్లు సమాచారం. 1948లో తొలిసారిగా పరిచయమైన ఒరిజినల్‌ 2 CV తక్కువ ధర, సింపుల్‌ డిజైన్‌, రోజువారీ అవసరాలకు అనుకూలమైన పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే ప్రత్యేకతలను సరికొత్త టెక్నాలజీలతో మళ్లీ అందించాలని కంపెనీ యోచిస్తోంది.

కొత్త 2 CV కాన్సెప్ట్‌ పొడవు 3.76 మీటర్లు. గుండ్రటి హెడ్‌ల్యాంపులు, వంపులతో కూడిన రూఫ్‌లైన్‌, ప్రత్యేకమైన బాడీ డిజైన్‌తో పాత మోడల్‌ను గుర్తు చేస్తుంది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, విశాలమైన సీట్లు, ఫ్యాబ్రిక్‌ సన్‌రూఫ్‌, రిమూవబుల్ స్టోరేజ్‌ బాస్కెట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కారు బరువును సుమారు ఒక టన్ను దగ్గర ఉంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బ్యాటరీ, తయారీ ఖర్చులను నియంత్రించి, కారును అందుబాటు ధరలో తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త మోడల్‌ ఎలక్ట్రిక్‌ కారుగా వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జింగ్‌తో ప్రయాణించే దూరం, ఛార్జింగ్‌ సమయం వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

యూరప్‌లో దీని ప్రారంభ ధర సుమారు 15,000 యూరోలు (దాదాపు రూ.16 లక్షలు) ఉండొచ్చని అంచనా. కానీ భారత్‌లో ఇదే ధరకు అందుబాటులోకి వస్తుందని చెప్పలేం. స్థానిక తయారీ, బ్యాటరీ ఖర్చులు, దిగుమతి విధానాలను బట్టి ధర మారవచ్చు. భారత్‌లో లాంచ్‌ తేదీపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. సిట్రోయెన్‌ మాతృసంస్థ స్టెల్లాంటిస్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కంపెనీ అదనంగా సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి భారత్‌లో మొత్తం రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఇదీ చదవండి: ఫుల్ ఛార్జ్‌పై 440 KM రేంజ్.. స్కోడా కొత్త కారు!

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)