అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
పండగొచ్చిందని బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!
Published on Sun, 10/18/2026 - 15:25
ప్రతి ఏటా దీపావళి సమయంలో.. లేదా ధన్తేరస్ (ధన త్రయోదశి) వచ్చిందంటే చాలామంది బంగారం కొనడానికి నగల దుకాణాలకు వెళ్తుంటారు. ఏడాది మొత్తం పెట్టుబడుల గురించి పెద్దగా పట్టించుకోని వాళ్లు కూడా.. ఆ రోజు మాత్రం బంగారం కొనడం మంచిదని భావిస్తారు. దీంతో దుకాణాల దగ్గర రద్దీ పెరుగుతుంది. పండగ పూట బంగారం కొనడం వల్ల సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. కానీ.. అది ఎంత వరకు నిజమో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
పండుగ కోసం బంగారం కొనడం వేరు, పెట్టుబడిగా బంగారం కొనడం వేరు. ధన్తేరస్ రోజున కొన్నాం కాబట్టి అది మంచి పెట్టుబడి అవుతుందని అనుకోవడం సరైంది కాదు. ఎందుకంటే.. బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆభరణాలు కొనేటప్పుడు తయారీ ఖర్చులు కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, అందరూ కొంటున్నారని మనం కూడా బంగారం కొనాలని తొందరపడకూడదు.
మన ఆదాయం ఎంత?, ఖర్చులు ఎంత?, భవిష్యత్తులో మనకు ఏ అవసరాలు ఉన్నాయి?, అనే విషయాలను ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. బంగారంతో పాటు ఇతర పెట్టుబడి మార్గాల గురించి కూడా తెలుసుకోవాలి. పండుగను ఆనందంగా జరుపుకోవడం మంచిదే. కానీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. కాబట్టి.. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం నిజమైన ఆర్థిక తెలివి.
ఇదీ చదవండి: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఇలా చెక్ చేసుకోండి
బంగారం ధరలు
గడిచిన కొన్ని రోజుల్లో భారతదేశంలో.. బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశమలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరల్లో మార్పులు సంభవించాయి. అయితే ఈ రోజు (ఆదివారం) మాత్రం గోల్డ్ రేటు ఉలుకు పలుకు లేకుండా.. స్థిరంగా ఉంది. నేటి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.
Tags : 1