భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..
Published on Sun, 10/18/2026 - 12:21
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే గతంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తూ సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. 2027 అక్టోబర్ 29న దీపావళికి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సందీప్ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు.
(ఇదీ చదవండి: జైలర్2లో అవకాశం.. నటి పూర్ణ ఎమోషనల్)
Check this out........ 😊 #Spirit #InSpiritMode @TSeries @VangaPictures #IndiasBiggestSuperStar 29TH OCTOBER DIWALI 2027 💥 Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026
Tags : 1