Breaking News

రెనో కొత్త హైబ్రిడ్ కారు.. 29 KM మైలేజీ!

Published on Sat, 10/17/2026 - 15:19

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ రెనో (Renault) కొత్త డస్టర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఈ-టెక్‌ 160 ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.16.99 లక్షలుగా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ ధర గరిష్ఠంగా రూ.19.49 లక్షల వరకు ఉంది. మెరుగైన ఇంధన సామర్థ్యంతో పాటు లేటెస్ట్‌ టెక్నాలజీని కోరుకునే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా కంపెనీ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

1.8 లీటర్‌ ఇంజిన్‌..

ఈ ఎస్‌యూవీలో 1.8 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు, 1.4 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ పవర్‌ట్రెయిన్‌ గరిష్ఠంగా 160 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సంప్రదాయ పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడంపై రెనో‌ దృష్టి సారించింది.

ఈ హైబ్రిడ్‌ వాహనం బ్యాటరీని ఛార్జ్‌ చేసేందుకు ప్రత్యేకంగా బాహ్య ఛార్జింగ్‌ సదుపాయం అవసరం లేదు. వాహనం నడుస్తున్నప్పుడు రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, ఇతర శక్తి పునరుద్ధరణ ప్రక్రియల ద్వారా బ్యాటరీకి తిరిగి విద్యుత్‌ అందుతుంది. అందువల్ల ఎలక్ట్రిక్‌ వాహనాల మాదిరిగా ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు.

ఫార్ములా-1 టెక్నాలజీతో..

డస్టర్‌ హైబ్రిడ్‌లో మరో ప్రధాన ఆకర్షణ మల్టీ-మోడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌. రెనో‌ ఫార్ములా-1 సాంకేతికత నుంచి స్ఫూర్తి పొందిన ఈ వ్యవస్థలో రెండు ఎలక్ట్రిక్‌ గేర్లు, నాలుగు పెట్రోల్‌ గేర్లు ఉన్నాయి. మొత్తం 15 రకాల డ్రైవింగ్‌ కాంబినేషన్లకు ఇది అవకాశం కల్పిస్తుంది. డ్రైవింగ్‌ పరిస్థితులకు అనుగుణంగా శక్తి వినియోగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం దీని ఉద్దేశం.

లీటరుకు 29 కి.మీ. మైలేజీ

ఇంధన సామర్థ్యం విషయంలోనూ కొత్త డస్టర్‌ ఆకట్టుకుంటుందని రెనో చెబుతోంది. ఈ ఎస్‌యూవీకి లీటరుకు 29 కిలోమీటర్ల ఏఆర్‌ఏఐ ధ్రువీకరించిన మైలేజీ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. తగిన పరిస్థితుల్లో నగర ప్రయాణాల్లో 80 శాతం వరకు పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడ్‌లో ప్రయాణించవచ్చని తెలిపింది. డీజిల్‌ వాహనంతో పోలిస్తే ఈ హైబ్రిడ్‌ వ్యవస్థ 29 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని కంపెనీ అంచనా వేస్తోంది.

లేటెస్ట్‌ ఫీచర్లు

హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో పాటు డస్టర్‌లో పలు ఆధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 212 మి.మీ. గ్రౌండ్‌ క్లియరెన్స్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, పవర్డ్‌ టెయిల్‌గేట్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఉన్నాయి. అలాగే 10.1 అంగుళాల ఓపెన్‌ఆర్‌ లింక్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అమర్చారు. టాప్‌-స్పెక్‌ ఎమోషన్‌ వేరియంట్‌లో డ్యూన్‌ బ్రౌన్‌ లెథరెట్‌ ఫినిష్‌తో కూడిన ఇంటీరియర్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

రెనో డస్టర్‌ హైబ్రిడ్‌ వేరియంట్ల ధరలివే..

రెనో డస్టర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఈ-టెక్‌ 160 మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ఎక్స్‌షోరూమ్‌ ధరలు ఇలా ఉన్నాయి..

  • ఎవల్యూషన్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఈ-టెక్‌ 160: రూ.16.99 లక్షలు

  • టెక్నో స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఈ-టెక్‌ 160: రూ.18.99 లక్షలు

  • ఎమోషన్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఈ-టెక్‌ 160: రూ.19.49 లక్షలు

ఇదీ చదవండి: దసరా వేళ మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. రూ.1.36 లక్షల వరకు!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య