Breaking News

చూపు లేదు... కాని నేర్పు ఉంది...!

Published on Sat, 10/17/2026 - 13:11

కంటిచూపు లేకపోయినా ఆత్మవిశ్వాసం, చేతిలో నైపుణ్యం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు మహారాష్ట్రలోని వాంగణి పట్టణానికి చెందిన అశోక్‌ గంగాధర్‌ భోయే. మూడేళ్ల పసిప్రాయంలోనే మశూచి వ్యాధి బారినపడి ఆయన పూర్తిగా చూపు కోల్పోయాడు. అయినా నిరాశపడకుండా జల్గావ్‌ జిల్లా  చాలీస్‌గావ్‌లోని రాష్ట్రీయ విద్యాలయంలో పదో తరగతి పూర్తి తచేశాడు. ఆపై మాలేగావ్‌లోని అంబేడ్కర్‌ కాలేజీలో చేరినా, పరీక్షలు రాసేందుకు సహాయకుడు దొరక్కపోవడంతో చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.

బతుకుదెరువు కోసం టెలిఫోన్‌ ఆపరేటర్‌ కోర్సు చేయడం, అరటిపండ్లు అమ్మడం, పిండి మిల్లు, కిరాణా దుకాణం నడపడం వంటి ఎన్నో పనులను అశోక్‌ చేశాడు. చివరకు చిన్నప్పటి ఆసక్తితో ఎలక్ట్రికల్‌ రిపేర్‌ షాపుల్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ‘కళ్లు లేని వ్యక్తి కరెంటు వస్తువులను ఎలా బాగు చేస్తాడు?’ అని మొదట్లో అంతా అనుమానించేవారు. కానీ, ‘రెండు రోజుల్లో రండి, మీ వస్తువు బాగుచేసి ఇస్తాను‘ అంటూ కేవలం చేతి స్పర్శ, శబ్దం ఆధారంగానే సర్క్యూట్‌ లోపాలను పసిగట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు అశోక్‌.

ఇదీ చదవండి: నమ్మించి ఏకంగా రూ. 9.6 కోట్లు కొట్టేసిన నర్స్‌. కట్‌ చేస్తే!
 

కుటుంబపోషణకు వచ్చే ఆదాయం సరిపోక మెరుగైన ఉపాధి కోసం 2007లో వాంగణికి మారిన అశోక్‌కు, స్థానికుడైన అంకుశ్‌ పట్నోరే అద్దె లేకుండా ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. మొదట్లో ఆటబొమ్మలు అమ్మడం, మసాజ్, ఆక్యుపంక్చర్‌ చేస్తూ అశోక్‌ తన కుటుంబాన్ని  పోషించాడు. ఒకసారి పాత ఇనుప సామాను వ్యాపారి రూ.50 విలువ కట్టిన పాత చెక్క రేడియోను అశోక్‌ రూ.150కి కొని, రిపేర్‌ చేసి ఏకంగా రూ.1,600కి అమ్మాడు. అక్కడి నుంచే ఆయన ‘వింటేజ్‌ రేడియోల’ ప్రయాణం మలుపు తిరిగింది.

ప్రస్తుతం ముంబై శివారు  ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణిస్తూ మూలనపడ్డ పాతకాలపు రేడియోలు, టేప్‌ రికార్డర్లను సేకరించి వాటికి పునరుజ్జీవాన్నిస్తున్నాడు. కొత్త టెక్నాలజీ కోసం యూట్యూబ్‌ ఆడియో ట్యుటోరియల్స్‌ వింటూ, తన కూతురు సహాయంతో అలాగే గుజరాత్‌లోని ఓ మెంటార్‌ సహకారంతో అశోక్‌ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి