Breaking News

భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు: ఆర్‌. నారాయణమూర్తి

Published on Sat, 10/17/2026 - 03:49

‘‘కోన వెంకట్‌గారు నిర్మాత కాకుంటే   ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సినిమా సెన్సాన్‌ ఇబ్బందుల్లో పడి ఉండేది, రిలీజ్‌ అయ్యుండేది కాదు. చాలా దుర్మార్గం ఇది. ‘బస్తర్‌’, ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాలను ఎందుకు సెన్సార్‌ చేశారు? ఎందుకు రిలీజ్‌ చేశారు? ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన మూవీ కాదు. పోలీసులకూ వ్యతిరేకం కాదు. కేవలం బ్యాక్‌డ్రాప్‌ మాత్రమే నక్సల్‌ బరీ మూమెంట్‌. నక్సలైట్లు ఏం పాపం చేశారు? వాళ్లు కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డలే. 

వారు కూడా భారతీయ  పౌరులే. ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలు కానీ, మేము కానీ నక్సలైట్లు కాదు.. మేము సినిమా తల్లి బిడ్డలం’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. జానకిరామ్‌ మారెళ్ల  దర్శకత్వంలో కోన వెంకట్‌ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలయింది. 

శుక్రవారం నిర్వహించిన ‘దసరా ఫన్‌ డగ బ్లాక్‌ బస్టర్‌ మీట్‌’ కి ఆర్‌. నారాయణ మూర్తి, డైరెక్టర్స్‌ హరీష్‌ శంకర్, వీఎన్‌ ఆదిత్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ–‘‘సెన్సార్‌ ఇబ్బందులు పెడితే సాధారణ నిర్మాత ఏం అయి పోవాలి? కోట్లతో పని. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు’’ అని పేర్కొన్నారు.     ‘‘ఈ సినిమాను శ్రీవిష్ణు బాగా ప్రమోట్‌ చేశారు’’ అన్నారు కోన వెంకట్‌. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు రూ. 30 కోట్ల రివార్డు ఇచ్చారు’’ అన్నారు వెంకట కృష్ణ కర్నాటి.    ‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ నాకు గుర్తుండి పోతుంది’’ అని జానకిరామ్‌ మారెళ్ల తెలిపారు.  రైటర్స్‌ బీవీఎస్‌ రవి, నందు, భాను, పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి