కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
కార్ఘరా దుర్గాపూజ
Published on Sat, 10/17/2026 - 01:35
ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని బారాబతిలో నివసిస్తున్న కార్ కుటుంబం ‘ఘట పూజ’ అనే 227 ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని నేటికీ పాటిస్తోంది. అత్యంత పురాతనమైన ఈ దుర్గ పూజను ‘కార్ఘరా దుర్గా పూజ’ అని పిలుస్తారు. కార్ కుటుంబ పూర్వీకులు పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్, మార్ద్వాన్ నుంచి బారాబతికి వలస వచ్చారు.
కార్ వంశానికి చెందిన పంచాన్ కార్ సముద్ర వాణిజ్యంలోకి అడుగు పెట్టాడు. ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఇండోనేసియా, మయన్మార్లకు విస్తరించింది. తమకు అపారమైన సంపదను ఇచ్చిన అమ్మవారికి కృతజ్ఞతగా, దేవిబది బంగ్లాలో అమ్మవారికి ప్రతీకగా కలశాలను ఉపయోగించి ‘ఘట పూజ’ మొదలుపెట్టారు కార్ వంశానికి చెందిన వారు. కాలక్రమంలో చుట్టు పక్కల వాళ్లు కూడా ఈ ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు.
‘మేము అమ్మను మా కుమార్తెగా, మహాదేవుడిని అల్లుడిగా భావించి పూజిస్తాం’ అని చెబుతుంటారు కార్ వంశీయులు. దశమినాడు దుర్గాదేవికి వీడ్కోలు పలికేటప్పుడు కార్ కుటుంబం ఆమెకు కుంకుమ పెట్టి, మిఠాయిలు సమర్పించి, వచ్చే ఏడాది తిరిగి రమ్మని ఆహ్వానిస్తారు. ‘ఘట పూజ’ను ఏడుతరాలను ఏకం చేసిన విశిష్ట సంప్రదాయంగా భావిస్తారు.
Tags : 1