Breaking News

ఒక టీవీ కొంటే మరో టీవీ ఫ్రీ.. టాప్‌ కంపెనీ ‘బిగ్‌’ ఆఫర్‌!

Published on Thu, 10/15/2026 - 21:44

దీపావళి పండుగ వేళ పెద్ద స్క్రీన్‌ టీవీ కొనాలనుకునే వినియోగదారులకు శాంసంగ్‌ ఇండియా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ‘బిగ్‌, బిగ్గర్‌, బిగ్గెస్ట్‌’ పేరుతో ప్రత్యేక పండుగ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన మోడళ్లను కొనుగోలు చేసేవారికి మరో విజన్‌ ఏఐ టీవీని లేదా సౌండ్‌బార్‌ను ఉచితంగా అందించనుంది. వీటితోపాటు క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐ సదుపాయాలు, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ వంటి ప్రయోజనాలను ప్రకటించింది.

రూ.1.59 లక్షల విలువైన టీవీ ఉచితం!

ఈ ప్రచారంలో భాగంగా అర్హత కలిగిన శాంసంగ్‌ టీవీ మోడల్‌ను కొనుగోలు చేస్తే.. గరిష్ఠంగా రూ.1,59,990 విలువైన మరో విజన్‌ ఏఐ టీవీని ఉచితంగా పొందవచ్చు. లేదంటే రూ.1,10,990 వరకు విలువైన శాంసంగ్‌ సౌండ్‌బార్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒక ప్రయోజనాన్ని మాత్రమే పొందగలరు. ఏ టీవీ మోడల్‌ను కొనుగోలు చేశారనే దానిపై ఉచితంగా లభించే ఉత్పత్తి, దాని విలువ ఆధారపడి ఉంటాయి.

20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌

ఉచిత ఉత్పత్తులతోపాటు విజన్‌ ఏఐ టీవీలపై గరిష్ఠంగా 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించలేని వినియోగదారుల కోసం జీరో డౌన్‌పేమెంట్‌ ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా మూడేళ్ల సమగ్ర వారంటీ ప్రయోజనాన్ని ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్లకు వర్తించే అర్హతలు, నిబంధనలను కొనుగోలుదారులు ముందుగా తెలుసుకోవాలి.

ఉచిత స్ట్రీమింగ్‌ ఛానెల్స్‌..

‘మేడ్‌ ఫర్‌ ఇండియా’ ప్లస్‌ ప్రయోజనాల్లో భాగంగా శాంసంగ్‌ పలు అదనపు సదుపాయాలను అందిస్తోంది. శాంసంగ్‌ ఆర్ట్‌ ప్లస్‌ ద్వారా ఆర్ట్‌ స్టోర్‌కు మూడు నెలల ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది. శాంసంగ్‌ టీవీ ప్లస్‌లో 200కు పైగా స్ట్రీమింగ్‌ ఛానెల్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ ద్వారా పేపర్‌లెస్‌ ఫైనాన్సింగ్‌ సదుపాయం పొందవచ్చు. శాంసంగ్‌ కేర్‌ ప్లస్‌ పొడిగించిన వారంటీ కవరేజీని అందించగా.. శాంసంగ్‌ సౌండ్‌ ప్లస్‌ మెరుగైన ఆడియో అనుభవంపై దృష్టి పెడుతుంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)