Breaking News

విదేశీ మేయర్.. దేశీ ఆటో! నార్వే మేయర్‌ భారత్‌ టూర్‌కి షాకవ్వాల్సిందే

Published on Thu, 10/15/2026 - 10:38

ఏదైనా దేశంలో పర్యటించాలంటే బైక్‌ లేదా కారులోనో రైడ్‌ చేస్తాం. ఇది సర్వసాధారణం. కానీ ఆటోలో పర్యటించడం గురించి విన్నారా. అదికూడా ఓ దేశంలోని నగర మేయర్‌ త్రీవీలర్‌లో వెళ్లడం అంటే నమ్ముతారా. ఇప్పుడు ఈ కథనం చదివాక కచ్చితంగా విస్తుపోతారు. 

నార్వేకు చెందిన మేయర్‌ ఆయన మేనల్లుడు మెరైన్‌ ఇంజనీర్‌ ఇద్దరు కలిసి ఆటోలో భారత్‌ని చుట్టోచ్చారు. అదేంటి ఆటోనా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ టూర్‌ అంతా  'రిక్షా రన్' (Rickshaw Run) అనే అంతర్జాతీయ ఈవెంట్‌లో భాగంగా జరిగింది. నార్వే ఉత్తరప్రాంతంలోని గడ్డకట్టే ఆర్కిటిక్‌ జలాల్లో ప్రయాణించే ఓయివిండ్‌ హెస్జెవిక్‌, ఆయన మేనమామ పోర్సాంగర్‌ మున్సిపాలిటి మేయర్‌ జో ఇంగే హెస్జెవిక్‌ భారత్‌లో విలక్షణమైన రోడ్డు ట్రిప్‌ చేపట్టారు. 

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి కేరళలోని కొచ్చి వరకు 13 రోజుల పాటు సాగే సుదీర్ఘ ప్రయానం. 'ది అడ్వెంచరిస్ట్స్' (The Adventurists) సంస్థ నిర్వహించే ఈ సవాలులో పాల్గొనేందుకు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్, ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌ నియమాల ప్రకారం..ఇందులో పాల్గొనేవారు ఒక్కో రిక్షాకు సుమారు రూ. 3 లక్షలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 23తో ప్రారంభమై అక్టోబర్‌ 09తో ముగిసింది. 

ఇక భారత్‌ టూర్‌కి ఆటోనే ఎంచుకోవడానికి కారణం కూడా తెలిపారు. ఇది నెమ్మదిగా వెళ్లే వాహనం. దీనిలో వెళ్తే ప్రజలతో సులభంగా కనెక్ట్‌ అవ్వోచ్చు అని అన్నారు. అలాగే మన పర్యటిస్తున్న దేశంతో సులభంగా సంబంధం ఏర్పరుచకోవడాని ఈ వాహనమే బెస్ట్‌ అని అన్నారు. తమ ప్రయాణానికి రోజుకి సుమారు రూ. 10 వేలు వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. దీంతోపాటు అంతర్జాతీయ విమాన ప్రయాణ ఖర్చులు, ఈవెంట్‌లో పాల్గొనే రుసుము తదితరాలు కూడా ఉంటాయన్నారు. ఈ జర్నీ ఒక చోట మాత్రం ఇబ్బందిపడినట్లు తెలిపారు. 

తాము తొలిరోజు పాకిస్థాన్‌ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నట్లు  తమకు తెలియదని చెప్పారు. అయితే సూర్యాస్తమయం తర్వాత, సరిహద్దుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలోని హోటల్‌లో బస చేయడానికి ప్రయత్నించాం. కానీ, సరిహద్దుకు ఇంత దగ్గరగా ఉన్న హోటళ్లలో విదేశీయులకు అనుమతి లేదని తెలిసింది. దాంతో చీకట్లోనే ఆటో నడుపుకుంటూ పోవాల్సి వచ్చినట్లు తెలిపారు. ఆ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల వెలుతురుతో చాలా ఇబ్బంది పడ్డట్లు వివరించారు. 

అలా ఆ రాత్రిపూట రెండు గంటలపాటు ప్రయాణించి ఇబ్బందిపడ్డామని, కానీ చివరకు సురక్షితంగా తమ జర్నీని పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. తమకు ముంబైలోని కొండ ప్రాంతాల్లో వర్షారణ్యాల మధ్య పైకి, కిందకు ప్రయాణిస్తున్నప్పుడు... అక్కడ ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా, పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన ప్రకృతి ప్రాంతం ఒకటి ఉందని మాకు అంతకుముందు తెలియదని అన్నారు. ఆ ప్రాంతంలో ఉండటం మాకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. అక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉండటంతో, ప్రయాణం చాలా సురక్షితంగా, ఎంతో అందంగా అనిపించిందన్నారు. 

ఇక ఓయివిండ్‌ తాను మెరైన్ ఇంజనీర్‌ అని, ఆర్కిటిక్ ప్రాంతంలో సొంతంగా ఒక కమర్షియల్ ఫిషింగ్ బోటును నడుపుతుంటానని చెప్పారు. తన మామయ్య స్థానిక పట్టణానికి మేయర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు నార్వే దేశీయలు ఒక భారతీయుడితో సంభాషించడంతో నెట్టింట వైరల్‌ అయ్యారు. ఆ భారత వ్యక్తి  మేయర్‌ జో ఇంగే హెస్‌జెవిక్‌ని అభినందించారు. ఎందుకంటే పట్టణ మేయర్‌ అయ్యుండి ఆటోలో భారదేశంలో పర్యటించడం అన్నది మాములు విషయం కాదని అన్నారు.

 

ఇదీ చదవండి: ఉన్నది ఒక్కటే లైఫ్‌..ప్లీజ్‌ క్లిష్టంగా మార్చుకోకండి..! టెక్‌ గురు మోహనదాస్‌ జీవన సూత్రాలివే

 

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)