Breaking News

నేను లెస్బియన్‌ కాదు.. పిరియడ్స్‌ వస్తాయి, కానీ : నటి స్నిగ్ధ

Published on Sun, 10/11/2026 - 16:13

ప్యాంట్‌, షర్ట్‌ వేసుకొని మగ రాయుడిలా కనిపిస్తూ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి స్నిగ్ధ నయని. 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించి... మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, చందమామ కథలు, టైగర్‌, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు కానీ.. సింగర్‌గా మాత్రం పలు షోలు చేస్తుంది. అయితే ఇటీవల ఈ నటికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌  నెట్టింట తెగ వైరల్‌ అయింది. 

ఆమె ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా ఆ వీడియో ఉంది. తాజాగా ఆ వైరల్‌ వీడియోపై స్నిగ్ధ, తన పెళ్లిపై స్పందించింది. రీల్స్‌ కోసం చేసిన వీడియో చూసి నిజంగానే నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆమె క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఈ రోజుకు 84 ఏళ్లు.. రూ.90కోట్ల అప్పు.. రూ.4000 కోట్ల సామ్రాజ్యం!)

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. మంచి ప్రేమను కోల్పోతున్నారు. అలా చేయొద్దని చెప్పేందుకే ఓ రీల్‌ చేశాను. అందులో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా నటించాను. దీంతో అందరూ నా పెళ్లి అయిపోయిందని అనుకుంటున్నారు. నా గురించి మొత్తం తెలిసిన రిలేటివ్స్‌ కూడా ‘పెళ్లి చేసుకున్నావా..మాకెందుకు చెప్పలేదు’అని అడుగుతున్నారు. మంచి సందేశం ఇచ్చేందుకు రీల్‌ చేస్తే.. ఇలా వైరల్‌ చేశారు’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఇక ‘మీరు లెస్బియన్‌  హా? అని యాంకర్‌ అడగగా.. ‘ప్రస్తుతానికి అయితే అమ్మాయినే. నాకు పీరియడ్స్‌ వస్తాయి. కానీ, పీసీఓడీ ఉండడం వల్ల రెండు, మూడు నెలలకు ఒకసారి పీరియడ్స్‌  వస్తాయి. పీసీఓడీ వల్లనే ముఖంపై అవాంచిత రోమాలు వస్తాయి. నాకే కాదు చాలా మంది అమ్మాయిలకు ఇలానే వస్తాయి. థ్రెడింగ్‌ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. 

ఇక పెళ్లి గురించి అడగ్గా.. ‘నాకు మంచి మనసు ఉన్న పర్సన్‌ దొరికితే కచ్చితంగా చేసుకుంటా. జెండర్‌తో సంబంధం లేదు. అమ్మాయిని అయినా పెళ్లి చేసుకుంటా. నాకు మంచి తోడు కావాలి. అలా దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా. లేదంటే ఇలానే సింగిల్‌గా ఉంటా’ అని అన్నారు. 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)